ఎంతటి నేతలకైనా ప్రజా వ్యతిరేకత ఖాయం: రాహుల్ గాంధీ
ABN , Publish Date - Sep 24 , 2026 | 05:43 PM
ఎంతటి నేతలపైనైనా కొన్నేళ్ల పాలన తర్వాత ప్రజా వ్యతిరేకత రావడం సహజమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. అయితే ఆ వ్యతిరేకత నుంచి తప్పించుకునేందుకు బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని ఆయన విమర్శించారు.
ఢిల్లీ, సెప్టెంబర్ 24: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. ఎంతటి బలమైన నాయకులైనా కొన్నేళ్ల పాలన తర్వాత వారిపై ప్రజా వ్యతిరేకత (Anti-incumbency) రావడం సహజమని, అయితే ఆ వ్యతిరేకత నుంచి తప్పించుకునేందుకు బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని రాహుల్ విమర్శించారు.
అయితే కొన్ని రాష్ట్రాల్లో ఈ ప్రజా వ్యతిరేకత ఎందుకు బయటకు కనిపించడం లేదో అర్థం కావడం లేదని, రాత్రికి రాత్రే ఇది ఎలా మాయమవుతుందని రాహుల్ ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం దేశంలోని స్వతంత్ర రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ, తమపై ఉన్న ప్రజా వ్యతిరేకతను కనుమరుగు చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తూ బీజేపీ ప్రభుత్వం 'ఓట్ చోరీ'కి పాల్పడుతోందని రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఈ వార్తలనూ చదవండి:
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు అభిజీత్ దీప్కే అల్టిమేటమ్.. 48 గంటల్లో రాజీనామా చేయకపోతే..
ఆ భయంకర సాఫ్ట్‌వేర్‌ని రద్దు చేయండి.. ఈసీఐనెట్ యాప్‌పై శశిథరూర్