నితిన్ గడ్కరీని కలిసిన రాహుల్, ప్రియాంక గాంధీ
ABN , Publish Date - Mar 18 , 2026 | 05:52 PM
కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా బుధవారంనాడు పార్లమెంటు హౌస్‌లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలుసుకున్నారు. రాజస్థాన్‌కు చెందిన బస్ అండ్ ట్రక్ బాడీ బిల్డర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ (Rahul Gandhi), ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) బుధవారంనాడు పార్లమెంటు హౌస్‌లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari)ని కలుసుకున్నారు. రాజస్థాన్‌కు చెందిన బస్ అండ్ ట్రక్ బాడీ బిల్డర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. బస్ అండ్ ట్రక్ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
అంతకముందు.. స్మాల్ మాన్యుఫ్యాక్చరర్స్ ప్రతినిధి బృందం సభ్యులు రాహుల్ గాంధీని కలిశారు. సవరించిన నిబంధనల వల్ల ధరలు, లైసెన్సులు పొందడంలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. నూతన రెగ్యులేటరీ ప్రమాణాలు, హెచ్చు ఫీజుల వల్ల తాము వ్యాపారాలను మానుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందని, ఇందువల్ల తామ జీవనోపాధి కోల్పోవాల్సి వస్తుందని వివరించారు.
కేంద్ర మంత్రి హామీ
గడ్కరీతో సమావేశానంతరం రాహుల్ గాంధీ మాట్లాడుతూ, లైసెన్స్ ప్రక్రియ ఖరీదైన వ్యవహారంగా మారడం, కాలహరణం జరుగుతుండటం వంటివి చోటుచేసుకుంటున్నాయని, ఈ విషయాన్ని గడ్కరీ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. సాధ్యమైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని గడ్కరీ హామీ ఇచ్చినట్టు రాహుల్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ప్రేమ మాతో, పెళ్లి మోదీతో.. రాజ్యసభలో ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు
కాంగ్రెస్‌కు షాక్.. బీజేపీలో చేరిన ఎంపీ ప్రద్యుత్ బోర్డోలోయ్