Share News

పంజాబ్‌ రవాణా మంత్రి భుల్లార్‌ రాజీనామా

ABN , Publish Date - Mar 22 , 2026 | 07:00 AM

రాష్ట్ర గోదాముల సంస్థ అమృత్‌సర్‌ జిల్లా మేనేజర్‌ గగన్‌దీ్‌పసింగ్‌ ఆత్మహత్యకు ప్రేరేపించారన్న ఆరోపణల నేపథ్యంలో పంజాబ్‌ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి భుల్లార్‌ శనివారం...

పంజాబ్‌ రవాణా మంత్రి భుల్లార్‌ రాజీనామా

ఛండీగఢ్‌, మార్చి 21: రాష్ట్ర గోదాముల సంస్థ అమృత్‌సర్‌ జిల్లా మేనేజర్‌ గగన్‌దీ్‌పసింగ్‌ ఆత్మహత్యకు ప్రేరేపించారన్న ఆరోపణల నేపథ్యంలో పంజాబ్‌ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి భుల్లార్‌ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. జిల్లాలో గోదాముల టెండరును తన తండ్రికి కేటాయించాలని మంత్రి భుల్లార్‌ ఒత్తిడి తెచ్చినా గగన్‌దీ్‌పసింగ్‌ సదరు టెండరును రూ.10 లక్షల ముడుపులు తీసుకుని మరొకరికి కేటాయించినట్లు ఆరోపణలొచ్చాయి. దీంతో ఈ నెల 13న గగన్‌దీ్‌ప సింగ్‌ను తన ఇంటికి పిలిపించిన మంత్రి భుల్లార్‌.. దాడి చేశారని సమాచారం. ‘మంత్రి భుల్లార్‌ నన్ను వేధిస్తున్నారు. నేను ఇప్పుడు బతకలేను. విషపూరిత పదార్థం తాగాను’ అని గగన్‌దీ్‌ప సింగ్‌ తన మిత్రుడిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన వీడియో బయటకొచ్చింది.

ఈ వార్తలు కూడా చదవండి..

అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతన్నలను ఆదుకుంటాం: సీఎం చంద్రబాబు

దేవుడి సాక్షిగా నేను రాసినవన్నీ నిజాలే.. వైఎస్ విజయలక్ష్మి షాకింగ్ కామెంట్స్

‘ఆస్కార్’ రేంజ్‌లో అవినాశ్‌ ప్రెస్‌మీట్.. బీటెక్ రవి సెటైర్లు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Mar 22 , 2026 | 07:00 AM