Share News

పుదుచ్చేరిలో ఎన్డీయే సీట్ల షేరింగ్ ఖరారు.. ఏఐఎన్‌ఆర్‌సీకి 16, బీజేపీకి 10 సీట్లు

ABN , Publish Date - Mar 20 , 2026 | 07:54 PM

పుదుచ్చేరిలోని ఆల్ ఇండియా ఎన్‌ఆర్ కాంగ్రెస్ సారథ్యంలోని ఎన్డీయేలో సీట్ల పంపకాలు ఖరారయ్యారు. ఆ ప్రకారం ఏఐఎన్ఆర్‌సీ 16 సీట్లలో పోటీ చేయనుండగా, భాగస్వామ్య పక్షమైన బీజేపీ 10 సీట్లలో పోటీ చేయనుంది.

పుదుచ్చేరిలో ఎన్డీయే సీట్ల షేరింగ్ ఖరారు.. ఏఐఎన్‌ఆర్‌సీకి 16, బీజేపీకి 10 సీట్లు
Puducherry CM N Rangasamy

న్యూఢిల్లీ: పుదుచ్చేరిలోని ఆల్ ఇండియా ఎన్‌ఆర్ కాంగ్రెస్ (AINRC) సారథ్యంలోని ఎన్డీయే (NDA)లో సీట్ల పంపకాలు ఖరారయ్యారు. ఆ ప్రకారం ఏఐఎన్ఆర్‌సీ 16 సీట్లలో పోటీ చేయనుండగా, భాగస్వామ్య పక్షమైన బీజేపీ (BJP) 10 సీట్లలో పోటీ చేయనుంది. తక్కిన భాగస్వామ్య పక్షాల్లో అన్నాడీఎంకే (AIADMK), ఎల్‌జేకే (LJK)కు చెరో రెండు సీట్లు కేటాయించారు.


ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి సారథ్యంలో ఎన్డీయే కూటమి ఎన్నికలకు వెళ్తోంది. ఎన్డీయే కూటమితో ఏఐఎన్ఆర్‌సీ పొత్తు కొనసాగించే విషయంలో కొద్దిరోజులుగా సస్పెన్స్ కొనసాగుతున్నప్పటికీ ఇందులో ఎలాంటి మార్పు లేదని, బీజేపీతో కలిసే ఎన్నికలకు వెళ్తున్నామని రంగస్వామి శుక్రవారంనాడు ప్రకటించారు. ఈసారి ఆయన రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. తట్టంచవాడి, మంగళం నియోజకవర్గాల్లో నామినేషన్లు వేశారు. ఏప్రిల్ 9న పోలింగ్ జరుగనుండగా, మే 4న ఫలితాలు వెలువడతాయి.


అతిపెద్ద పార్టీగా..

2021 పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో రంగస్వామి సారథ్యంలోని ఏఐఎన్ఆర్‌సీ 10 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా నిలిచింది. డీఎంకే 6, కాంగ్రెస్ 6, బీజేపీ 6 సీట్లు గెలుచుకున్నాయి. 84.8 శాతం ఓటింగ్ నమోదైంది. 2016 ఎన్నికల్లో కాంగ్రెస్ 15 సీట్లతో మెజారిటీ సాధించింది. ఏఐఎన్ఆర్‌సీ 8 సీట్లు, అన్నాడీఎంకే 4 సీట్లు, డీఎంకే 2 సీట్లు దక్కించుకున్నాయి. 83.6 శాతం పోలింగ్ నమోదైంది.


ఇవి కూడా చదవండి..

బీజేపీతోనే పొత్తు.. ఊహాగానాలకు తెరదించిన పుదుచ్చేరి సీఎం

టీఎంసీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన మమతా బెనర్జీ

Updated Date - Mar 20 , 2026 | 08:01 PM