ఊటీ పుష్ప ప్రదర్శనకు ఏర్పాట్లు
ABN , Publish Date - Apr 08 , 2026 | 01:00 PM
వేసవి ప్రారంభంతో ఊటీకి వచ్చే పర్యాటకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. 23వ తేదీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత, ఊటీకి వచ్చే పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
బొటానికల్ గార్డెన్‌లో వికసిస్తున్న పుష్పాలు
చెన్నై: వేసవి ప్రారంభంతో ఊటీకి వచ్చే పర్యాటకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. 23వ తేదీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత, ఊటీకి వచ్చే పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ సంవత్సరం పుష్ప ప్రదర్శన తేదీలు ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ, ఈ కార్యక్రమం మే 2న జరుగుతుందని భావిస్తున్నారు. పుష్ప ప్రదర్శన సన్నాహాల్లో భాగంగా, ఉద్యానవనాన్ని ప్రస్తుతం శరవేగంగా సిద్ధం చేస్తున్నారు 35వేల కుండీల్లో పెంచుతున్న కొన్ని మొక్కలు పుష్పిస్తున్నాయి.
ముఖ్యంగా, పాన్సీలు, సాల్వియాలు, కోలియస్ వంటి మొక్కలు వికసించడం మొదలుపెట్టాయి. ఉద్యానవనాన్ని సందర్శించే పర్యాటకులు ఈ పూల అందాలను చూసి ముచ్చటపడుతున్నారు. అంతేకాకుండా, వృక్షశాస్త్ర ఉద్యానవనంలోనే ఉన్న ఫెర్న్‌హౌస్ కూడా పర్యాటకుల కోసం తెరిచేవుంచారు. దీనితో, సందర్శనకు వచ్చే పర్యాటకులు ఇప్పుడు ఆ ప్రాంగణంలో ఉన్న అనేక రకాల ఫెర్న్ మొక్కలను, ఇతర అరుదైన మొక్కల దగ్గర సెల్ఫీలు తీసుకుంటున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
మందుబాబులకు చేదు వార్త.. మూడు రోజులు షాపులు బంద్
కమల్‌ను ప్రచారానికి ఆహ్వానించిన సీపీఎం
Read Latest Telangana News and National News