పచ్చి పాలతో ఫేస్ మసాజ్.. చర్మ సమస్యలకు సహజ పరిష్కారం
ABN , Publish Date - Apr 08 , 2026 | 12:30 PM
పచ్చి పాలతో ముఖానికి మసాజ్ చేయడం ద్వారా చర్మం కాంతివంతంగా మారుతుంది. ఇది ముడతలు, మచ్చలు, పొడి చర్మం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
ఇంటర్నెట్ డెస్క్: పచ్చి పాలతో ముఖాన్ని మసాజ్ చేయడం ద్వారా చర్మానికి అనేక ప్రయోజనాలు ఉంటాయి. పచ్చి పాలలోని పోషకాలు చర్మాన్ని కాంతివంతం చేస్తాయి, శుభ్రంగా ఉంచుతాయి, మచ్చలు, ముడతలను తగ్గిస్తాయి.
చర్మాన్ని శుభ్రపరచడం:
పచ్చి పాలను సహజ క్లెన్సర్ లా ఉపయోగించవచ్చు. దూదితో, పచ్చి పాలను ముఖంపై పూయడం ద్వారా చర్మంపై మృతకణాలు తొలగి.. శుభ్రంగా మారుతుంది.
కాంతివంతమైన చర్మం:
ప్రతిరోజూ ముఖానికి పాలు రాసుకోవడం వల్ల చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. పచ్చి పాలలో ఉండే పోషకాలు చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తాయి. అలాగే, పాలతో మసాజ్ చేయడం వల్ల ముడతలు తగ్గే అవకాశం కూడా ఉంది.

మచ్చలను తగ్గించడం:
ఎక్కువగా మచ్చలు లేదా మొటిమలు ఉన్నవారికి పచ్చి పాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. 10–20 నిమిషాల పాటు ముఖానికి పచ్చి పాలను అప్లై చేసి, తరువాత కడుక్కోవడం ద్వారా మచ్చలు తగ్గడానికి, చర్మం మంచిగా కనిపించడానికి సహాయపడుతుంది.
మృదువైన చర్మం:
పొడిగా, కాంతి లేని చర్మం కోసం పచ్చి పాలు ఉపయోగించవచ్చు. పాలు చర్మానికి తేమను అందించి, మృదువుగా మార్చుతాయి.
జాగ్రత్తలు:
పచ్చి పాలు అందరికీ మంచివి కాకపోవచ్చు. మొదటిసారి ఉపయోగిస్తున్నప్పుడు, ప్యాచ్ టెస్ట్ చేయడం అవసరం. ప్రతికూల ప్రభావం (చర్మం వాపు, ఇర్రిటేషన్) లేని విధంగా చూసుకున్న తర్వాత మాత్రమే ముఖానికి పూర్తి స్థాయిలో ఉపయోగించాలి.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
ఈ వార్తలు కూడా చదవండి..
పాలను ఇలా తాగితే హైబీపీకి చెక్.. సింపుల్ చిట్కా..
గంటల తరబడి కూర్చొని పని చేస్తున్నారా? అయితే ఈ నష్టం తప్పదు
For More Latest News