Share News

పాత కూలర్‌లో దాగి ఉన్న ప్రమాదాలు.. ఈ జాగ్రత్తలు పాటించండి

ABN , Publish Date - Apr 07 , 2026 | 09:28 AM

వేసవిలో చాలా మంది పాత కూలర్లను మళ్లీ వాడుతున్నారు. అయితే వాటిని సరిగా శుభ్రం చేయకుండా ఉపయోగిస్తే ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పాత కూలర్‌లో దాగి ఉన్న ప్రమాదాలు.. ఈ జాగ్రత్తలు పాటించండి
Air Cooler Cleaning Tips

ఇంటర్నెట్ డెస్క్: వేసవి తాపం నుంచి ఉపశమనం పొందడానికి కూలర్లు, ఏసీలు (AC) ఎంతో అవసరం. అందుకే ఈ కాలంలో చాలా మంది ఇళ్లలో కూలర్లు, ఏసీలను విస్తృతంగా ఉపయోగిస్తారు. కొందరు కొత్త కూలర్లు కొనుగోలు చేస్తే, మరికొందరు పాత కూలర్లను శుభ్రం చేసి మళ్లీ వాడతారు. అయితే, పాత కూలర్‌ను శుభ్రం చేయకుండా వాడటం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలా రోజులుగా వాడని కూలర్‌లో దుమ్ము, మురికి పేరుకుపోతాయి. వాటిని శుభ్రం చేయకుండా వాడితే గాలి ద్వారా బ్యాక్టీరియా, ఫంగస్ మన శరీరంలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది.


ఏ సమస్యలు వస్తాయి?

కూలర్‌లో నిల్వ ఉండే నీరు దోమల పెంపకానికి, ముఖ్యంగా డెంగ్యూ, మలేరియా వ్యాప్తి చేసే దోమలకు ప్రధాన నిలయంగా మారుతుంది. దీని వల్ల డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అలాగే మురికి కారణంగా అలర్జీలు, ఆస్తమా, తుమ్ములు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలు కూడా వస్తాయి.

ఎలా శుభ్రం చేయాలి?

ముందుగా కూలర్ ప్యాడ్‌లను తీసివేసి, లోపలి భాగాన్ని శుభ్రం చేయాలి. మోటార్, ఫ్యాన్ బ్లేడ్స్‌పై ఉన్న దుమ్మును గుడ్డతో తుడవాలి. అవసరమైతే కొద్దిగా నూనె వేసి ఫ్యాన్ సాఫీగా తిరిగేలా చూడాలి. తర్వాత వాటర్ ట్యాంక్‌ను బాగా కడగాలి. ముందుగా కొద్దిగా వెనిగర్ వేసి కొంతసేపు ఉంచితే దుర్వాసన పోతుంది. తరువాత శుభ్రంగా కడిగితే మంచిది. కూలింగ్ ప్యాడ్‌లు పాడైపోయి ఉంటే కొత్తవి పెట్టాలి. ప్యాడ్‌లు శుభ్రంగా ఉంటేనే మంచి గాలి వస్తుంది.


వేసవిలో కూలర్ వాడేముందు దాన్ని పూర్తిగా శుభ్రం చేయడం చాలా ముఖ్యం. ఇలా చేస్తే మంచి చల్లదనం పొందడమే కాకుండా ఆరోగ్య సమస్యలను కూడా దూరంగా ఉంచుకోవచ్చు.


ఈ వార్తలు కూడా చదవండి..

పాలను ఇలా తాగితే హైబీపీకి చెక్.. సింపుల్ చిట్కా..

గంటల తరబడి కూర్చొని పని చేస్తున్నారా? అయితే ఈ నష్టం తప్పదు

For More Latest News

Updated Date - Apr 07 , 2026 | 09:29 AM