Share News

వేసవిలో తప్పక తినాల్సిన పండ్లు ఇవే

ABN , Publish Date - Apr 07 , 2026 | 08:20 AM

వేసవిలో డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటం ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఈ సమయంలో సహజంగా లభించే కొన్ని పండ్లు దాహాన్ని తీర్చడమే కాకుండా, జీర్ణక్రియను మెరుగుపరచి శరీరానికి శక్తినిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

వేసవిలో తప్పక తినాల్సిన పండ్లు ఇవే
Summer Fruits Benefits

ఇంటర్నెట్ డెస్క్: వేసవి ఎండలు రోజురోజుకీ తీవ్రంగా మారుతున్నాయి. ఉదయం నుంచే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు బయటకు వెళ్లడాన్ని కష్టతరం చేస్తున్నాయి. ఈ వేడి కారణంగా శరీరంలో నీటి శాతం డీహైడ్రేషన్, జీర్ణ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. తాత్కాలిక ఉపశమనం కోసం తీపి పానీయాలపై ఆధారపడటం కంటే, సహజంగా శరీరాన్ని చల్లగా ఉంచే పండ్లు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.


పుచ్చకాయ:

వేసవిలో ఎక్కువగా తినాల్సిన పండు పుచ్చకాయ. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండటంతో దాహం తీరుతుంది. జీర్ణక్రియకు కూడా ఇది సహాయపడుతుంది.

Watermelon.jpg

బొప్పాయి:

జీర్ణ సమస్యలు తగ్గించడానికి బొప్పాయి చాలా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే ఎంజైములు ఆహారం సులభంగా జీర్ణం కావడానికి సహాయపడతాయి.


మామిడి:

వేసవి కాలం అంటేనే మామిడి పండ్ల సీజన్. ఇది శరీరానికి శక్తినిస్తుంది, పేగులకు చాలా మంచిది. కానీ ఎక్కువగా తింటే బరువు పెరగడం, చక్కెర స్థాయిలు పెరగడం జరుగుతుంది. కాబట్టి మితంగా తినాలి.

Mango.jpg

అరటిపండ్లు:

అరటి పండ్లు పోషకాల గని. తక్షణ శక్తినిచ్చే అద్భుతమైన పండు. ఇవి పొటాషియం, విటమిన్లు, ఫైబర్‌తో నిండి ఉండి, గుండె ఆరోగ్యం, రక్తపోటు నియంత్రణ, జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తాయి. సీజన్‌తో సంబంధం లేకుండా చౌకగా లభించే ఈ పండ్లు శరీర పెరుగుదలకు, ఎముకల దృఢత్వానికి చాలా అవసరం.

Banana (1).jpg


పైనాపిల్:

పైనాపిల్‌లో జీర్ణక్రియకు సహాయపడే ఎంజైములు ఉంటాయి. ఇవి శరీరంలో వాపు తగ్గించడంలో కూడా సహాయపడతాయి. వేసవిలో కేవలం శీతల పానీయాలపై ఆధారపడకుండా, ఇలాంటి సహజ పండ్లు తినడం వల్ల శరీరం చల్లగా ఉండటంతో పాటు ఆరోగ్యంగా ఉంటుంది.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

ఈ వార్తలు కూడా చదవండి..

పాలను ఇలా తాగితే హైబీపీకి చెక్.. సింపుల్ చిట్కా..

గంటల తరబడి కూర్చొని పని చేస్తున్నారా? అయితే ఈ నష్టం తప్పదు

For More Health News

Updated Date - Apr 07 , 2026 | 08:27 AM