నిందితుల ఫొటోలు పోలీసులే ఆన్‌లైన్‌లో పెట్టడం ఆందోళనకరం
ABN , Publish Date - Mar 22 , 2026 | 06:55 AM
నిందితుల ఫొటోలు, వీడియోలను పోలీసులే ఆన్‌లైన్, సామాజిక మాధ్యమాల్లో పెట్టడం ఆందోళనకరమని సుప్రీంకోర్టు...
న్యూఢిల్లీ, మార్చి 21: నిందితుల ఫొటోలు, వీడియోలను పోలీసులే ఆన్‌లైన్, సామాజిక మాధ్యమాల్లో పెట్టడం ఆందోళనకరమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇది దర్యాప్తుపైనా, నిష్పక్షపాత విచారణపైనా ప్రభావం చూపుతుందని అభిప్రాయపడుతుంది. పోలీసులు సామాజిక మాధ్యమాల్లో నిందితుల ఫొటోలను, వీడియోలను అప్‌లోడ్ చేయడంపై హేమేంద్ర పటేల్ అనే వ్యక్తి పిల్ దాఖలు చేశారు. నిందితుల ఫొటోలను మీడియాలో ప్రసారం చేయడంపై పలు మార్గదర్శకాలున్నాయని, వాటిని సోషల్ మీడియాకు కూడా వర్తింపజేయాలని కోరారు. దీనికి ధర్మాసనం సుముఖత వ్యక్తం చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతన్నలను ఆదుకుంటాం: సీఎం చంద్రబాబు
దేవుడి సాక్షిగా నేను రాసినవన్నీ నిజాలే.. వైఎస్ విజయలక్ష్మి షాకింగ్ కామెంట్స్
‘ఆస్కార్’ రేంజ్‌లో అవినాశ్ ప్రెస్‌మీట్.. బీటెక్ రవి సెటైర్లు
Read Latest AP News And Telangana News And International News And Telugu News