విషమిచ్చి చంపి.. రంపంతో కోసి
ABN , Publish Date - Sep 02 , 2026 | 06:41 AM
బిర్యానీ పాత్రలో మహిళ శరీర భాగాలు లభ్యమైన కేసులో దిగ్ర్భాంతికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో మణిపూర్‌కు పరారైన మాణిక్ ఉత్తిన్, అతని ప్రియురాలు బసుమతి మాజీని పోలీసులు అరెస్టు చేసి రెండు రోజుల కిందట చెన్నైకి తీసుకొచ్చారు.
చెన్నైలో శరీరభాగాలతో బిర్యానీ కేసులో వెలుగులోకి నిజాలు
చెన్నై, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): బిర్యానీ పాత్రలో మహిళ శరీర భాగాలు లభ్యమైన కేసులో దిగ్ర్భాంతికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో మణిపూర్‌కు పరారైన మాణిక్ ఉత్తిన్, అతని ప్రియురాలు బసుమతి మాజీని పోలీసులు అరెస్టు చేసి రెండు రోజుల కిందట చెన్నైకి తీసుకొచ్చారు. ఆ జంట పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం మేరకు.. ఒడిసాకు చెందిన హయదున్నీసా(38) భర్తను విడిచిపెట్టి చెన్నైలోని ఓ అద్దె ఇంట్లో నివసించేవారు. క్రోంపేటలోని ప్రైవేటు సంస్థలో ఆమె పనిచేస్తుండగా అక్కడే పనిచేస్తున్న మాణిక్‌ఉత్తిన్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. హయదున్నీసా గర్భం దాల్చారు. పెళ్లి చేసుకోవాలని మాణిక్‌పై ఒత్తిడి తేవడంతో ఈ వ్యవహారం మాణిక్ ప్రియురాలు బసుమతికి తెలిసింది. దీంతో హయదున్నీసాను హతమార్చేందుకు వీరిద్దరూ ప్రణాళిక రూపొందించారు. ఆగస్టు 1న హయదున్నీసాకు విషం కలిపిన ఆహారం పెట్టి హతమార్చారు. ఆమె శవాన్ని రంపంతో ముక్కలుగా కోశారు. కొన్ని శరీర భాగాలను పెద్ద సూట్‌కేసులో పెట్టి ఆగ్రా వెళ్లే రైలులో వదిలేశారు. ఆ తర్వాత మిగిలిన భాగాలను బిర్యానీ వండుకునే పెద్దపాత్రలో ఉంచి ఉడికించారు. ముఖాన్ని ఎవరూ గుర్తుపట్టని విధంగా తలను ఛిద్రం చేశారు. హయదున్నీసా తల పోలీసులకు ఇంతవరకు దొరకలేదు.
ఈ వార్తలు కూడా చదవండి
హిట్ అండ్ రన్ కేసు.. సినీ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడి అరెస్టు