Share News

ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌కి ప్రధాని మోదీ ఫోన్

ABN , Publish Date - Mar 05 , 2026 | 07:39 PM

అంతర్జాతీయంగా పశ్చిమాసియాలో నెలకొన్న తాజా పరిస్థితులపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌తో ప్రధాని మోదీ సంభాషించారు.

ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌కి ప్రధాని మోదీ ఫోన్
PM Modi Macron Phone Call

ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయంగా పశ్చిమాసియాలో నెలకొన్న తాజా పరిస్థితులపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌ (Emmanuel Macron)కి ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. యుద్ధ వాతావరణం, తాజా పరిస్థితులపై ఆయనతో మోదీ ఫోన్ ద్వారా చర్చలు జరిపారు. ప్రస్తుతం పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతలపై పలు కీలక విషయాలు సంభాషించారు. ఈ భేటీకి సంబంధించిన వివరాలను ప్రధాని స్వయంగా సోషల్ మీడియా వేదిక 'X' (ట్విట్టర్) ద్వారా వెల్లడించారు.


‘ఈరోజు నా స్నేహితుడు అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌తో మాట్లాడాను. పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితిపై మా ఉమ్మడి ఆందోళనలు వెలిబుచ్చాం. దీనికి చర్చలు, దౌత్యమే మార్గమని మేము చర్చించాం. ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం పునరుద్ధరణ అవసరం. ఈ విషయం గురించి మరింత చర్చలు జరుపుతాం. త్వరగా శాంతి నెలకొనేలా ప్రయత్నాలు చేస్తాం. ఫ్రాన్స్‌తో భారత్ సమన్వయం కొనసాగుతుంది’ అని ప్రధాని మోదీ తన 'X' పోస్ట్‌లో పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

యుద్ధం కాదు.. చర్చలే పరిష్కారం: ప్రధాని మోదీ

గల్ఫ్‌లో తీవ్ర ఉద్రిక్తతలు.. చిక్కుల్లో 23 వేల మంది భారతీయులు

Updated Date - Mar 05 , 2026 | 07:51 PM