Share News

'శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్' శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని ప్రశంసలు

ABN , Publish Date - Sep 05 , 2026 | 08:34 PM

దేశంలోనే అత్యున్నత విద్యాసంస్థల్లో ఒకటైన ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన 'శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్' శతాబ్ది ఉత్సవాలకు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

'శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్' శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని ప్రశంసలు
PM Modi Hails SRCC Legacy Ahead Of Centenary Celebrations

ఢిల్లీ, సెప్టెంబర్ 5: దేశంలోనే అత్యున్నత విద్యాసంస్థల్లో ఒకటైన ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన 'శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్' (SRCC) శతాబ్ది ఉత్సవాలకు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సెప్టెంబర్ 5 (ఉపాధ్యాయుల దినోత్సవం) సాయంత్రం 7 గంటలకు జరిగిన ఈ వేడుకలకు ముందు ప్రధాని సామాజిక మాధ్యమం 'ఎక్స్' (X) వేదికగా కళాశాల అందించిన సేవలను ప్రశంసించారు.


వ్యాపారం, ప్రజాజీవితం, సామాజిక రంగాలలో తరతరాల నాయకులను తీర్చిదిద్దడంలో ఎస్‌ఆర్‌సీసీ ఎంతో విశిష్టమైన ముద్ర వేసిందని, విద్యా ప్రతిభ, సంస్థాగత నిర్మాణంలో ఈ కళాశాల ప్రత్యేక గుర్తింపు సాధించిందని ప్రధాని కొనియాడారు.


జెన్ జీ (Gen Z) విద్యార్థులతో ముఖాముఖి

ఉపాధ్యాయుల దినోత్సవం నాడే ఈ శతాబ్ది వేడుకలు జరగడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ కళాశాలకు చెందిన 'జెన్ జీ' (Gen Z) విద్యార్థులతో నేరుగా ముఖాముఖి నిర్వహించారు. యువత తమ ఆలోచనలు, ఆకాంక్షలు, భవిష్యత్ లక్ష్యాలను దేశ ప్రధానితో నేరుగా పంచుకునేందుకు ఈ కార్యక్రమం ఒక వేదికగా నిలిచింది. ఈ వేడుకలకు హాజరుకావడానికి ప్రధాని మోదీ ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించి కాలేజ్ ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ జర్నీలో మెట్రో రైలులోని చిన్నారులు, మహిళలతో మోదీ ముచ్చటించారు.


శతాబ్దాల విద్యా వారసత్వం

కామర్స్, ఎకనామిక్స్, మేనేజ్‌మెంట్ రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా ఉన్న ఎస్‌ఆర్‌సీసీని 1926లో ప్రముఖ పారిశ్రామికవేత్త, దాత సర్ శ్రీరామ్ స్థాపించారు. గడిచిన వంద సంవత్సరాల్లో ఈ కళాశాల ఎందరో మేధావులను, పరిపాలనాధికారులను, పారిశ్రామికవేత్తలను, విధాన నిర్ణేతలను దేశానికి అందించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆ నిర్మాణాల నాణ్యత విషయంలో రాజీపడొద్దు: సీఎం రేవంత్‌‌రెడ్డి

సన్నబియ్యం అమ్మితే రేషన్ కార్డు తొలగిస్తాం: మంత్రి తుమ్మల

రైతుల జీవితాలతో రేవంత్ రెడ్డి ఆడుకుంటున్నారు.. హరీశ్‌రావు ధ్వజం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 05 , 2026 | 08:55 PM