Share News

సుడిగాలి ప్రచారంలో మరమరాల మిక్చర్‌ను ఆస్వాదించిన మోదీ

ABN , Publish Date - Apr 19 , 2026 | 08:31 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పశ్చిమబెంగాల్‌లో ఆదివారంనాడు సుడిగాలి ప్రచారం సాగించారు. పురూలియా, ఝార్‌గ్రామ్, మేదినీపూర్, బిష్ణుపూర్‌లలో వరుస ర్యాలీల్లో పాల్గొన్నారు. ప్రచారానంతరం ఝూర్‌గ్రామ్‌లోని ఒక చిన్న దుకాణంలో రుచిరకమైన మరమరాలు (ఝుల్‌మురిని) తింటూ కొద్దిసేపు అక్కడి స్థానికులతో మమేకమయ్యారు.

సుడిగాలి ప్రచారంలో మరమరాల మిక్చర్‌ను ఆస్వాదించిన మోదీ
PM Modi

మేదినిపూర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పశ్చిమబెంగాల్‌లో ఆదివారంనాడు సుడిగాలి ప్రచారం సాగించారు. పురూలియా, ఝార్‌గ్రామ్, మేదినీపూర్, బిష్ణుపూర్‌లలో వరుస ర్యాలీల్లో పాల్గొన్నారు. ప్రచారానంతరం ఝూర్‌గ్రామ్‌లోని ఒక చిన్న దుకాణంలో రుచిరకమైన మరమరాలు (ఝుల్‌మురిని) తింటూ కొద్దిసేపు అక్కడి స్థానికులతో మమేకమయ్యారు. బెంగాల్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన రుచిరకమైన స్నాక్‌గా ఝుల్‌మురికి పేరుంది.


ప్రధానమంత్రి ఝుల్‌మురిని తీసుకునేందుకు దుకాణం వద్ద ఆగడంతో స్థానికులు, ప్రధానంగా మహిళలు పెద్దసంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. ప్రధాని వారిని నవ్వుతూ పలకరిస్తూ స్నాక్స్‌ను వారికి కూడా పంచారు. తెల్లటి కుర్తా, డార్క్ బ్లూ కోట్, ఎరుపురంగ స్కార్ఫ్, దానిపై ఎంబ్రాయిడరీ అల్లికతో ఉన్న బిజీపే గుర్తుతో మోదీ ఎంతో ఉల్లాసంగా కనిపించారు. పలువురు తమ స్మార్ట్ ఫోన్లతో ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. ఆ క్షణాలను ప్రధాని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో షేర్ చేశారు. నాలుగు ర్యాలీల మధ్యలో రుచికరమైన మరమరాలు తిన్నానని అందులో పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

మహిళా రిజర్వేషన్‌ను అడ్డుకున్న టీఎంసీని శిక్షించండి: మోదీ పిలుపు

ద్రౌపది వస్త్రాపహరణాన్ని తలపించిన విపక్షాల చర్య: యోగి ఆదిత్యనాథ్

Updated Date - Apr 19 , 2026 | 08:34 PM