స్వాతంత్ర్య దినోత్సవం వేళ.. 'బాంధనీ' తలపాగాతో ఆకట్టుకున్న ప్రధాని
ABN , Publish Date - Aug 15 , 2026 | 11:48 AM
80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వేదికగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వరుసగా 13వ సారి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ చరిత్రాత్మక ఘట్టంలో ప్రధాని మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఢిల్లీ, ఆగస్టు 15: 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వేదికగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వరుసగా 13వ సారి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం దేశప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ చరిత్రాత్మక ఘట్టంలో ప్రధాని మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎరుపు రంగుతో కూడిన సాంప్రదాయ రాజస్థానీ బాంధనీ తలపాగాను ధరించి ఆకట్టుకున్నారు. దీనికి జతగా తెల్లటి కుర్తా, గోధుమ రంగు కలిగిన కోట్‌ను ధరించారు. జేబులో జాతీయ జెండా రంగులతో కూడిన ‘పాకెట్ స్క్వేర్’ను ప్రత్యేకంగా అలంకరించుకున్నారు.
బాంధనీ వస్త్ర కళ ప్రత్యేకలు:
'బాంధనీ' అనేది రాజస్థాన్, గుజరాత్ ప్రాంతాల్లో అత్యంత ప్రసిద్ధి చెందిన వస్త్ర కళ. చిన్న చిన్న వస్త్రాలను దారంతో కట్టి.. రంగులు అద్దే విధానంలో ఈ డిజైన్లు రూపొందుతాయి. ఆ దారాలు తొలగించిన తర్వాత వస్త్రంపై చుక్కలు, ఆకృతులు కనిపిస్తాయి. రాజస్థానీ సంస్కృతిలో తలపాగా అనేది కేవలం ధరించే వస్త్రం మాత్రమే కాదు. అది ఆత్మగౌరవానికి, గౌరవ మర్యాదలకు చిహ్నంగా భావిస్తారు. ఇక స్వాతంత్ర్య దినోత్సవం వేళ ప్రధాని మోదీ ధరించే తలపాగాలు ఏటా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. 2025లో ఆయన కాషాయ తలపాగా, తెల్లటి కుర్తాతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
సీఎం విజయ్ తల్లిదండ్రుల పక్కనే త్రిష.. స్వాతంత్ర్య వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్
ఎర్రకోటలో తొలిసారి పూర్తిగా వందేమాతరం గేయం..