సీఎం విజయ్ తల్లిదండ్రుల పక్కనే త్రిష.. స్వాతంత్ర్య వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్
ABN , Publish Date - Aug 15 , 2026 | 11:46 AM
చెన్నైలోని ఫోర్ట్ సెయింట్ జార్జిలో జరిగిన భారత స్వాతంత్ర్య వేడుకల్లో ప్రముఖ నటి త్రిష ప్రధాన ఆకర్షణగా నిలిచారు. త్రిష తన తల్లితో కలిసి ఈ వేడుకలకు వచ్చారు. సీఎం విజయ్ తల్లిదండ్రుల పక్కనే కూర్చొన్న ఆమె.. వారితో ఆప్యాయంగా మాట్లాడారు. ప్రత్యేక ఆహ్వానితుల కోసం ముందు వరుసలో ఏర్పాటు చేసిన కుర్చీలో ఆమె కూర్చొన్నారు.
చెన్నై, ఆగస్టు 15: చెన్నైలోని ఫోర్ట్ సెయింట్ జార్జిలో జరిగిన భారత స్వాతంత్ర్య వేడుకల్లో ప్రముఖ నటి త్రిష ప్రధాన ఆకర్షణగా నిలిచారు. త్రిష తన తల్లితో కలిసి ఈ వేడుకలకు వచ్చారు. సీఎం విజయ్ తల్లిదండ్రుల పక్కనే కూర్చొన్న ఆమె.. వారితో ఆప్యాయంగా మాట్లాడారు. ప్రత్యేక ఆహ్వానితుల కోసం ముందు వరుసలో ఏర్పాటు చేసిన కుర్చీలో ఆమె కూర్చొన్నారు. ఈ వేడుకలకు వచ్చిన వారి దృష్టిని త్రిష ఆకర్షించింది.
మరో వైపు 80వ భారత స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనేందుకు శనివారం ఫోర్ట్ సెయింట్ జార్జికి సీఎం విజయ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం వివిధ శాఖల్లో సేవలు చేసిన పలువురు ప్రభుత్వ ఉద్యోగులతోపాటు పోలీసులకు పురస్కారాలను సీఎం విజయ్ అందజేశారు.