ప్రజలకు సాష్టాంగ వందనం.. బెంగాల్‌లో ప్రధాని ఏం చేశారో చూడండి..
ABN , Publish Date - May 09 , 2026 | 01:22 PM
పశ్చిమ బెంగాల్ నూతన ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోదీ ప్రజలకు సాష్టాంగ వందనం చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పశ్చిమ బెంగాల్ నూతన ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోదీ ప్రజలకు సాష్టాంగ వందనం చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా ప్రజలు తరలివచ్చారు (PM Modi Bengal gesture).
భారీ సంఖ్యలో హాజరైన ప్రజలను చూసిన ప్రధాని మోదీ ముందుగా చేతులు ఊపుతూ అభివాదం చేశారు. అనంతరం మోకాళ్లపై కూర్చుని, చేతులు జోడించి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పశ్చిమ బెంగాల్ చరిత్రలో బీజేపీ తొలిసారిగా అధికారంలోకి వచ్చింది. తమకు మద్దతుగా నిలిచిన ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విధంగా తన కృతజ్ఞతలు తెలియజేశారు (Narendra Modi bows to public).
ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు బీజేపీ అగ్రనేతలు హాజరయ్యారు (Suvendu Adhikari oath ceremony). దాదాపు పదిహేనేళ్లు పశ్చిమ బెంగాల్‌ను పాలించిన మమతా బెనర్జీ తాజా ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. గతంలో తృణమూల్ కాంగ్రెస్‌లో ఉన్న సువేందు అధికారి, ఆ తర్వాత బీజేపీలో చేరి కీలక నేతగా ఎదిగారు. బెంగాల్‌లో బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించి ఏకంగా ముఖ్యమంత్రి అయిపోయారు.
ఇవి కూడా చదవండి..
రష్యా-ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణ.. ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్..
స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..