Share News

పార్లమెంట్ సమావేశాలకు రంగం సిద్ధం.. కీలక బిల్లులతో కేంద్రం అజెండా

ABN , Publish Date - Jul 16 , 2026 | 06:50 PM

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న బిజినెస్ లిస్ట్‌ను సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ గురువారం విడుదల చేశారు.

పార్లమెంట్ సమావేశాలకు రంగం సిద్ధం.. కీలక బిల్లులతో కేంద్రం అజెండా

న్యూఢిల్లీ, జులై 16: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న బిజినెస్ లిస్ట్‌ను సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ గురువారం విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం 5 కొత్త బిల్లులను ప్రవేశపెట్టనుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 37కి పెంచేందుకు చట్ట సవరణ చేయనుంది. గ్లోబల్ మార్కెట్ ఒడిదుడుకుల నేపథ్యంలో ఆదాయపు పన్ను చట్టంలో కీలక సవరణలు చేపట్టనుంది. విదేశీ విరాళాల నియంత్రణ (FCRA) సవరణ బిల్లుపై ఈ సమావేశాల్లో చర్చించి.. ఆమోదం తెలపనుంది.


ఉభయ సభల సంయుక్త కమిటీ పరిశీలనలో ఉన్న 'వికసిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్ బిల్లు'పై తుది నిర్ణయం తీసుకోనుంది. జనన, మరణాల ఆలస్యం రిజిస్ట్రేషన్ల నిబంధనలను మరింత కఠినతరం చేయనుంది. జాతీయ గౌరవానికి భంగం కలిగించడాన్ని నిరోధించే చట్టానికి మరికొన్ని సవరణలు చేయనుంది. MSME రంగంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఆలస్యపు చెల్లింపుల పరిష్కారం కోసం సరికొత్త బిల్లులను ఈ సమావేశాల్లో తీసుకురానుంది.


రాష్ట్రాలు సొంతంగా MSME ఫెసిలిటేషన్ కౌన్సిళ్లను ఏర్పాటు చేసుకునేలా చట్ట సవరణ చేయనుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అదనపు నిధుల (Excess Grants) వ్యయంపై లోక్‌సభలో ఓటింగ్ నిర్వహించనుంది. ఆగస్ట్ 13వ తేదీతో ఈ వర్షాకాల సమావేశాలు ముగుస్తాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

డీలిమిటేషన్‌తో ఏ రాష్ట్రానికీ నష్టం జరగదు: బీజేపీ ఎంపీ

తెలంగాణ నుంచి కర్ణాటకకు రేషన్ బియ్యం స్మగ్లింగ్.. ఐదుగురి అరెస్ట్

Read Latest National News And Telugu News

Updated Date - Jul 16 , 2026 | 06:59 PM