Share News

తెలంగాణ నుంచి కర్ణాటకకు రేషన్ బియ్యం స్మగ్లింగ్.. ఐదుగురి అరెస్ట్

ABN , Publish Date - Jul 16 , 2026 | 06:18 PM

తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం ముఠా గుట్ట రట్టు చేశారు గచ్చిబౌలి పోలీసులు. ఈ ముఠాకు చెందిన ఐదుగురు వ్యక్తులను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.

తెలంగాణ నుంచి కర్ణాటకకు రేషన్ బియ్యం స్మగ్లింగ్.. ఐదుగురి అరెస్ట్

హైదరాబాద్, జులై 16: తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం ముఠా గుట్ట రట్టు చేశారు గచ్చిబౌలి పోలీసులు. ఈ ముఠాకు చెందిన ఐదుగురు వ్యక్తులను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వారి నుంచి 220 టన్నుల రేషన్ బియ్యం, 40 బ్యాగుల గోధుమలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.4 లక్షలు ఉంటుందని తెలిపారు. ఈ బియ్యం, గోధుమలు తరలిస్తున్న 4 లారీలు, 4 టాటా ఏస్ వాహనాలను సీజ్ చేసినట్లు చెప్పారు.


నిందితులపై కంట్రోల్ యాక్ట్ - 2016 కింద కేసు నమోదు చేసినట్లు వివరించారు. గౌలిదొడ్డి నుంచి కర్ణాటకకు ఈ రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా పట్టుకున్నామని పేర్కొన్నారు. నిందితులను విచారిస్తున్నామని పేర్కొన్నారు. వారి నుంచి వివరాలు రాబడుతున్నట్లు చెప్పారు. సివిల్ సప్లయ్స్ విజిలెన్స్ విభాగంలోని అధికారులతోపాటు గచ్చిబౌలి పోలీసులు సంయుక్తంగా ఈ దాడి నిర్వహించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

డీలిమిటేషన్‌తో ఏ రాష్ట్రానికీ నష్టం జరగదు: బీజేపీ ఎంపీ

వర్షాభావాన్ని ఎదుర్కొనేందుకు సమగ్ర కార్యాచరణ సిద్ధం చేస్తాం: మంత్రి తుమ్మల

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 16 , 2026 | 06:29 PM