36 నిమిషాల్లో 7 బిల్లులు.. ప్రశ్నోత్తరాల సమయం లేకుండానే సాగిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు..
ABN , Publish Date - Aug 11 , 2026 | 09:48 PM
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నప్పటికీ.. ప్రభుత్వం తన శాసన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తోంది. ఈ సమావేశాల్లో ఇప్పటివరకు 19 బిల్లులు ఆమోదం పొందాయి.
ఇంటర్నెట్ డెస్క్: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నప్పటికీ.. ప్రభుత్వం తన శాసన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తోంది. ఈ సమావేశాల్లో ఇప్పటివరకు 19 బిల్లులు ఆమోదం పొందాయి. వాటిలో ఏడు బిల్లులను కేవలం 36 నిమిషాల్లోనే ఆమోదించడం విశేషం. మరోవైపు ఈ సమావేశాల్లో ఇప్పటివరకు ఒక్కసారి కూడా ప్రశ్నోత్తరాల సమయం సజావుగా జరగలేదు (Parliament Monsoon Session 2026).
పార్లమెంట్ వర్షాకాల సమవేశాల్లో బిల్లుల ఆమోద ప్రక్రియ వేగంగా సాగింది. ఒక దశలో కేవలం 36 నిమిషాల్లోనే ఏడు బిల్లులు ఆమోదం పొందాయి. అంటే సగటున ఐదు నిమిషాలకు ఒక బిల్లు చొప్పున ఆమోదించినట్లయింది. కొన్ని బిల్లులకు ఎంపీలు సవరణలు ప్రతిపాదించడంతో వాటికి కొంత ఎక్కువ సమయం పట్టింది. అయితే మొత్తం మీద ప్రతిపక్షాల నిరసనల మధ్యే ప్రభుత్వం తన శాసన కార్యక్రమాన్ని కొనసాగించింది (7 Bills Passed in 36 Minutes).
సమావేశాలు ముగియడానికి ఇంకా రెండు రోజులు ఉండగానే ప్రభుత్వం ఇప్పటివరకు 19 బిల్లులను ఆమోదింపజేసింది. అయితే వాటిలో చాలా బిల్లులు విస్తృత చర్చ లేకుండానే ఆమోదం పొందాయి. అదే సమయంలో విదేశీ విరాళాల నియంత్రణ చట్టం, నియోజకవర్గాల పునర్విభజన వంటి వివాదాస్పద అంశాలకు సంబంధించిన బిల్లులపై ఇంకా ముందడుగు పడలేదు (Question Hour Disrupted).
ఈ వర్షాకాల 15 రోజుల సమావేశాలను రోజుకు ఆరు గంటల చొప్పున లెక్కిస్తే సుమారు 90 గంటల పని జరగాల్సి ఉంది (Parliament Bills). అయితే లోక్‌సభ కేవలం 15 గంటల 36 నిమిషాలు మాత్రమే పనిచేసింది. రాజ్యసభ మాత్రం 24 గంటల 21 నిమిషాల పాటు కార్యకలాపాలు నిర్వహించింది. ఈ సమావేశాల్లో అత్యంత ప్రభావితమైన అంశం ప్రశ్నోత్తరాల సమయం. ఇప్పటివరకు ఈ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయం ఒక్కసారి కూడా సజావుగా సాగలేదు. నిరంతర ఆందోళనలు, సభలో గందరగోళం కారణంగా ఈ అవకాశం సభ్యులకు దక్కలేదు.
ఇవి కూడా చదవండి..
దశాబ్దాల నష్టానికి పరిహారం చెల్లించాలి.. ఇరాన్ ముందు ట్రంప్ కొత్త డిమాండ్..
అమిత్ షా సభకు రావాలి.. విపక్షాల నినాదాలు..