Share News

భారత్‌ నుంచి ద్వైపాక్షిక చర్చలకు ఆహ్వానం రాలేదు: పాక్ మంత్రి

ABN , Publish Date - Nov 22 , 2026 | 09:35 PM

భారత్‌ తనను ఎలాంటి ద్వైపాక్షిక చర్చలకూ ఆహ్వానించలేదని పాకిస్థాన్ వాతావరణ శాఖ మంత్రి ముసాదిక్ మాలిక్ తెలిపారు.

భారత్‌ నుంచి ద్వైపాక్షిక చర్చలకు ఆహ్వానం రాలేదు: పాక్ మంత్రి

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌ తనను ఎలాంటి ద్వైపాక్షిక చర్చలకూ ఆహ్వానించలేదని పాకిస్థాన్ వాతావరణ శాఖ మంత్రి ముసాదిక్ మాలిక్ తెలిపారు. కేవలం తనకు ఎస్‌సీఓ (షాంఘై కోపరేషన్‌ ఆర్గనైజేషన్‌) సదస్సు కోసం మాత్రమే పిలుపొచ్చిందని చెప్పారు. అయితే అధికారికంగా ఆహ్వానిస్తే చర్చల్లో పాల్గొంటామని స్పష్టం చేశారు. రెండు దేశాల (భారత్, పాక్) మధ్య ద్వైపాక్షిక చర్చలు నిర్వహిస్తే ప్రతి ప్రశ్నపై తాను స్పందిస్తానని ఆయనే పేర్కొన్నారు. నవంబర్ 20 తేదీన ప్రారంభమైన ఎస్‌సీఓ సదస్సు కోసం భారత్‌కు ముసాదిక్ మాలిక్ వచ్చిన సంగతి విదితమే. ఈ సమావేశం తరువాత ఆయన ఢిల్లీ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా భారత్‌తో ఎలాంటి చర్చా జరగలేదని వెల్లడించారు.


ఉగ్రవాదం నుంచి.. సింధూ జలాల వరకూ చర్చకు సిద్ధం

‘రెండు దేశాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ద్వైపాక్షిక చర్చలు అవసరం. ఇందుకోసం ఇరు దేశాలూ ముందుకురావాలి. భారత్ మమ్మల్ని ఆహ్వానిస్తే.. చర్చలో పాల్గొనేందుకు మేము సిద్ధం. ఉగ్రవాదంతో అన్ని దేశాలకూ ముప్పు ఉంది. ఈ మహమ్మారి పాకిస్థాన్‌లోనూ ఎంతో మందిని బలి తీసుకుంది. సమగ్ర చర్చలతో ఈ సమస్యకు పరిష్కారం వెతకాలి’ అని పాక్ మంత్రి ముసాదిక్ మాలిక్ అభిప్రాయపడ్డారు. సింధూ జలాల విషయంలోనూ ద్వైపాక్షిక చర్చలు అవసరమని చెప్పారు.


ఈ వార్తలూ చదవండి

వారికి ఆధ్యాత్మిక సంప్రదాయాలపై అవగాహన లేదు.. బీజేపీ, ఆర్ఎస్ఎస్‌పై రాహుల్ ఫైర్

సోనియా గాంధీ బాల్యం గడిపిన ఇల్లు ఎప్పుడైనా చూశారా.. నెట్టింట ఫొటోలు వైరల్..

Updated Date - Nov 22 , 2026 | 09:40 PM