Share News

దేశవ్యాప్తంగా కేంద్ర భద్రతా దళాల హై అలర్ట్

ABN , Publish Date - Nov 09 , 2026 | 06:42 PM

ఎర్రకోట పేలుడుకు రేపటితో ఏడాది పూర్తికానుంది. దీంతో దేశవ్యాప్తంగా కేంద్ర భద్రతా బలగాలు హై అలర్ట్ అయ్యాయి. ఆ పేలుడు జరిగినప్పటి నుంచి చేపట్టిన వివిధ ఆపరేషన్లలో 300 మందికి పైగా నిందితులను అరెస్టు చేశారు. మరోవైపు ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

దేశవ్యాప్తంగా కేంద్ర భద్రతా దళాల హై అలర్ట్

ఇంటర్నెట్ డెస్క్: ఎర్రకోట పేలుడుకు రేపటితో ఏడాది పూర్తికానుంది. దీంతో దేశవ్యాప్తంగా కేంద్ర భద్రతా బలగాలు హై అలర్ట్ అయ్యాయి. ఆ పేలుడు జరిగినప్పటి నుంచి చేపట్టిన వివిధ ఆపరేషన్లలో 300 మందికి పైగా నిందితులను అరెస్టు చేశారు. మరోవైపు ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. శ్రీనగర్ పోలీసుల చొరవతో 'డాక్టర్ మాడ్యూల్' కుట్ర కోణం వెలుగులోకి వచ్చింది. ఫరీదాబాద్‌లోని అల్ ఫలా వర్సిటీ సమీపంలో 2,900 కేజీల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో ప్రధాన సూత్రధారి డాక్టర్ ఉమర్-ఉన్ నబీ వాహన పేలుడులోనే మృతి చెందాడు.


ఫిబ్రవరి 23న 'ప్రహార్' పేరుతో నూతన జాతీయ కౌంటర్ టెర్రరిజం పాలసీని ప్రారంభించారు. పాక్ ఆధారిత ఎస్‌బీఎన్ నెట్‌వర్క్‌పై 100కు పైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. 300 మందికి పైగా ఆపరేటివ్‌లను అరెస్టు చేశారు. విదేశాల్లో పరారీలో ఉన్న ఉగ్రవాదులను వేగంగా రప్పించేందుకు సెప్టెంబర్‌లో ఎక్స్‌ట్రడిషన్ పోర్టల్ ప్రారంభించారు. జైషే మహమ్మద్, లష్కరే తొయిబా, ఖలిస్థాన్, జేఎంబీ ఉగ్ర మాడ్యూళ్లను భద్రతా బలగాలు, పోలీసులు ధ్వంసం చేశారు. అలాగే రసాయనాలు, అమ్మోనియం నైట్రేట్ విక్రయాలపై దేశవ్యాప్తంగా భద్రతా బలగాలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి.


ఈ వార్తలనూ చదవండి:

యూపీ ఎన్నికలు.. 209 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఖరారు

మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలిస్తుండగా రోడ్డు ప్రమాదం.. ఏడుగురి మృతి

Updated Date - Nov 09 , 2026 | 06:42 PM