ముస్లిం రైతు ఇచ్చిన పాలు తాగిన అస్సాం సీఎం
ABN , Publish Date - Nov 09 , 2026 | 04:40 PM
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఒక ముస్లిం రైతు ఇచ్చిన పాలను వేదికపైనే తాగారు. ఈనెల 7న నాగావ్ జిల్లా సమాగురిలో నిర్వహించిన విజయోత్సవ కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది.
ఇంటర్నెట్ డెస్క్: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఒక ముస్లిం రైతు ఇచ్చిన పాలను వేదికపైనే తాగారు. ఈనెల 7న నాగావ్ జిల్లా సమాగురిలో నిర్వహించిన విజయోత్సవ కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. తన సొంత డెయిరీ ఫామ్‌లో ఉత్పత్తి చేసిన పాలను ముహమ్మద్ సోహబ్ అలీ అనే రైతు.. ముఖ్యమంత్రి హిమంతకు అందజేశారు. ‘అవి ఆవు పాలా? గేదె పాలా?’ అని హిమంత అడగ్గా.. ఆవు పాలని రైతు సమాధానమిచ్చాడు. దీంతో హిమంత ఆ బాటిల్ నుంచి కొంత పాలు తాగారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఆయన ఎక్స్‌లో షేర్ చేశారు. సోహబ్ అలీ ఇచ్చిన బహుమతిని 'డెయిరీ లిషియస్ గిఫ్ట్' గా అభివర్ణించారు. పాడి రైతులు లాభదాయకంగా వ్యాపారం నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటోందని తెలిపారు. అస్సాంలో రోజువారీ పాల ఉత్పత్తిని 10 లక్షల లీటర్లకు పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సీఎం పేర్కొన్నారు.
కాగా.. ఎన్‌డీఏ అభ్యర్థి దేవాశిష్ శర్మ.. నాగావ్ లోక్‌సభ ఉప ఎన్నికలో విజయం సాధిస్తే రూపాహిహాట్ ప్రాంతాన్ని సందర్శించి స్థానికులతో కలిసి వేడుకలు జరుపుకొంటానని ఎన్నికల ప్రచారం సమయంలో హిమంత హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన అక్కడ పర్యటించి విజయోత్సవాల్లో పాల్గొన్నారు. ముస్లిం ఓటర్లు గణనీయంగా ఉన్న నాగావ్ లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీ విజయం సాధించింది. రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. పాల ఉత్పత్తిని పెంచడంతోపాటు పాడి రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునేలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ వార్తలనూ చదవండి:
యూపీ ఎన్నికలు.. 209 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఖరారు
భారతీయ పర్యాటకుల ప్రవర్తనపై హర్ష్ గోయెంకా సీరియస్..