రాబోయే కాలంలో ఏ శక్తి భారత్‌ను ఆపలేదు.. రాజ్‌నాథ్ సింగ్
ABN , Publish Date - May 23 , 2026 | 08:38 PM
ఒకప్పుడు ఆయుధాలు దిగుమతి చేసుకునే దశలో ఉన్న ఇండియా రాబోయే 25-30 ఏళ్లలో అతిపెద్ద ఆయుధాల సరఫరాదారుగా నిలవనుందని, దీనిని ఏ శక్తీ అడ్డుకోలేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
షిర్డి: ఒకప్పుడు ఆయుధాలు దిగుమతి చేసుకునే దశలో ఉన్న ఇండియా రాబోయే 25-30 ఏళ్లలో అతిపెద్ద ఆయుధాల సరఫరాదారుగా నిలవనుందని, దీనిని ఏ శక్తీ అడ్డుకోలేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) అన్నారు. షిర్డీలో మందుగుడు సామాగ్రి తయారీ కేంద్రాన్ని (Ammunition Manufacturing Unit) శనివారంనాడు ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రక్షణ ఉత్పత్తులల్లో ప్రైవేటు రంగం పాత్రను 50 శాతానికి తీసుకు వెళ్లడమే తమ లక్ష్యమని చెప్పారు. రక్షణరంగానికి కేవలం నట్లు, బోల్టుల సరఫరాదారుగానే ప్రైవేటు రంగం మిగిలిపోవడం లేదన్నారు. అత్యాధునిక ఆయుధాల వ్యవస్థలో కీలక తయారీదారుగా ఉండనుందని చెప్పారు.
ప్రభుత్వ విజన్, ప్రైవేట్ సెక్టార్ వినూత్న ఆవిష్కరణల సమన్వయంతో దేశం కొత్త శిఖరాలను అధిరోహిస్తుందని రాజ్‌నాథ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. 'అందరం కలిసికట్టుగా పనిచేసి భారత్‌ను మందుగుండు సామాగ్రి తయారీ, ఆటోమేషన్ హబ్‌గా రూపొందిద్దాం' అని అన్నారు.
ఇవి కూడా చదవండి..
భారత్-అమెరికా భాగస్వామ్యం ప్రపంచానికి కీలకం: మార్కో రుబియో
రాజ్యసభలో అడుగుపెట్టనున్న విజయ్ టీవీకే