భారత్-అమెరికా భాగస్వామ్యం ప్రపంచానికి కీలకం: మార్కో రుబియో
ABN , Publish Date - May 23 , 2026 | 08:05 PM
ప్రపంచ శాంతి, భద్రత, స్థిరత్వం కోసం ఇండియా-అమెరికా భాగస్వామ్యం ఎంతో ముఖ్యమైనదని అగ్రరాజ్య విదేశాంగ మంత్రి మార్కో రుబియో వ్యాఖ్యానించారు.
ప్రపంచ శాంతి, భద్రత, స్థిరత్వం కోసం ఇండియా-అమెరికా భాగస్వామ్యం ఎంతో ముఖ్యమైనదని అగ్రరాజ్య విదేశాంగ మంత్రి మార్కో రుబియో వ్యాఖ్యానించారు. న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన సమావేశంలో రక్షణ, వాణిజ్యం, టెక్నాలజీ, ఇండో-పసిఫిక్ భద్రత, ఇంధన సహకారం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. భారత్‌ను అమెరికా అత్యంత కీలక వ్యూహాత్మక భాగస్వామిగా చూస్తోందని రుబియో తెలిపారు (India US partnership).
భారత పర్యటనలో భాగంగా రుబియో ముందుగా కోల్‌కతాను సందర్శించారు. అనంతరం ఢిల్లీలో విదేశాంగ మంత్రి జైశంకర్‌తో సమావేశమయ్యారు. క్వాడ్ కూటమి బలోపేతం, చైనా ప్రభావం, ప్రాంతీయ భద్రత వంటి అంశాలు ప్రధాన చర్చగా మారాయి. అనంతరం సేవా తీర్థ్ (పీఎంవో)లో ప్రధానితో గంట పాటు భేటీ అయ్యారు. ప్రధానితో భేటీ అనంతరం రుబియో మీడియాతో మాట్లాడారు. తమ దేశానికి భారత్ అత్యంత కీలక భాగస్వామి అని రుబియో పేర్కొన్నారు (PM Modi Rubio meeting).
'భారత్-అమెరికా మధ్య బంధాలు మరింత బలపడనున్నాయి (India America relations). భారతీయ కంపెనీలు అమెరికాలో 20 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టాయి. భారత్‌కు ముడి చమురును సరఫరా చేయడానికి అమెరికా సిద్ధంగా ఉంది. ప్రపంచ ఇంధన మార్కెట్‌ను తన ఆధీనంలోకి తీసుకోవడానికి ఇరాన్ చేస్తున్న ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోము' అని రుబియో స్పష్టం చేశారు. కాగా, ప్రపంచ శ్రేయస్సు కోసం అమెరికాతో కలిసి పనిచేయడానికి భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఇరాన్‌తో నెలకొన్న ఉద్రిక్తతలను పరిష్కరించుకోవడానికి శాంతియుతంగా చర్చలు జరపాలని ప్రధాని సూచించారు.
ఇవి కూడా చదవండి..
రాజ్యసభ సీటు అమ్ముకున్నారు.. ఆప్‌పై హర్భజన్ సంచలన ఆరోపణలు..
టెహ్రాన్‌కు పాకిస్థాన్ ఆర్మీ చీఫ్.. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు..