భారతీయుల నుంచి సంస్కారం నేర్చుకోండి: మార్కో రుబియోకు ఇరాన్ చురక..
ABN , Publish Date - May 23 , 2026 | 06:23 PM
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో భారత్ పర్యటనకు వచ్చిన నేపథ్యంలో ఇరాన్ వ్యంగ్యంగా స్పందించింది. ఇరాన్ ముంబై కాన్సులేట్ సోషల్ మీడియా వేదికగా రుబియోను ఉద్దేశిస్తూ 'భారతీయుల నుంచి కొంచెమైనా మర్యాద, సంస్కారం నేర్చుకోండి' అంటూ ఎక్స్ ఖాతాలో వ్యంగ్యంగా ఓ పోస్ట్ చేసింది.
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో భారత్ పర్యటనకు వచ్చిన నేపథ్యంలో ఇరాన్ వ్యంగ్యంగా స్పందించింది. ఇరాన్ ముంబై కాన్సులేట్ సోషల్ మీడియా వేదికగా రుబియోను ఉద్దేశిస్తూ 'భారతీయుల నుంచి కొంచెమైనా మర్యాద, సంస్కారం నేర్చుకోండి' అంటూ ఎక్స్ ఖాతాలో వ్యంగ్యంగా ఓ పోస్ట్ చేసింది. అమెరికా-భారత్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచేందుకు మార్కో రుబియో ప్రస్తుతం పర్యటనకు వచ్చారు (Iran reacts to Rubio).
యుద్ధం ముగింపు చర్చలు జరుగుతుతన్న ప్రస్తుత తరుణంలో అమెరికాకు చెందిన కొందరు నేతల డిమాండ్లు, ప్రవర్తనపై ఇరాన్ తీవ్ర ఆగ్రహంగా ఉంది. ఇరాన్ తమ డిమాండ్లకు తలొగ్గకుంటే మరోసారి సైనిక చర్యకు దిగుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. అమెరికా ఉపాధ్యక్షుడు, రక్షణ మంత్రి కూడా ఇరాన్‌కు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ అమెరికా విదేశంగా మంత్రికి చురక అంటించింది (US Iran tensions).
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో భారత్ పర్యటన తొలి రోజే ప్రధాని నరేంద్ర మోదీతో న్యూఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించారు (Iranian consulate Mumbai). దాదాపు గంటకు పైగా సాగిన ఈ భేటీలో కీలక అంశాలు చర్చకు వచ్చినట్టు సమాచారం. అంతకు ముందు రుబియో కోల్‌కతాకు చేరుకుని మథర్ థెరిసా స్థాపించిన మిషనరీస్ ఆఫ్ ఛారిటీ ప్రధాన కేంద్రాన్ని సందర్శించారు.
ఇవి కూడా చదవండి..
రాజ్యసభ సీటు అమ్ముకున్నారు.. ఆప్‌పై హర్భజన్ సంచలన ఆరోపణలు..
టెహ్రాన్‌కు పాకిస్థాన్ ఆర్మీ చీఫ్.. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు..