Share News

సీఎం నివాసాన్ని ముందే ఖాళీ చేస్తున్న నితీశ్.. సామాన్ల తరలింపు

ABN , Publish Date - Apr 11 , 2026 | 09:13 PM

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేయడానికి ముందే సీఎం అధికారిక నివాసాన్ని ఖాళీ చేస్తున్నారు. సీఎం అధికారిక నివాసం అన్నేమార్గ్-1 నుంచి అన్నే మార్గ్-7 సర్క్యులర్ రోడ్డులో కొత్తగా కేటాయించిన భవనానికి శనివారంనాడు ట్రాక్టర్లతో కొన్ని సామన్లను తరలించారు.

సీఎం నివాసాన్ని ముందే ఖాళీ చేస్తున్న నితీశ్.. సామాన్ల తరలింపు
Nitish Kumar

న్యూఢిల్లీ: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar) తన పదవికి రాజీనామా చేయడానికి ముందే సీఎం అధికారిక నివాసాన్ని ఖాళీ చేస్తున్నారు. సీఎం అధికారిక నివాసం అన్నేమార్గ్-1 నుంచి అన్నే మార్గ్-7 సర్క్యులర్ రోడ్డులో కొత్తగా కేటాయించిన భవనానికి శనివారంనాడు ట్రాక్టర్లతో కొన్ని సామన్లను తరలించారు. మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ నివాసానికి సమీపంలో నితీశ్ కొత్త బంగ్లా ఉంది.


13న రాజీనామా.. 15న కొత్త సీఎం ప్రమాణస్వీకారం

రాజ్యసభ సభ్యుడిగా శుక్రవారంనాడు ప్రమాణస్వీకారం చేసిన నితీశ్ కుమార్ మరో రెండు రోజల్లో మాజీ సీఎం కానున్నారు. ఈనెల 13 లేదా 14 తేదీల్లో ఆయన సీఎం పదవికి రాజీనామా చేయనుండగా, కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఈనెల 15న ఉంటుందని తెలుస్తోంది.


కొత్త సీఎం ప్రమాణస్వీకారానికి ఆ ఇద్దర్లో ఒకరు

కాగా, కొత్త సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమం లోక్‌భవన్ (రాజ్‌భవన్ కొత్తపేరు)లో జరుగుతుందని, ఈసారి ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కానీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కానీ హాజరు కావచ్చని తెలుస్తోంది. ప్రధాని హాజరయినట్లయితే బిహార్‌లో తొలి బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి మోదీ హాజరయినట్టు అవుతుంది. అప్పుడు ప్రమాణస్వీకార కార్యక్రమం ఏప్రిల్ 18న ఉండవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


ఇవి కూడా చదవండి..

పాలన అనేది సినిమా కాదు, రీటేక్స్ ఉండవు: విజయ్‌ ఎంట్రీపై చిదంబరం

జననాయగన్ లీక్‌ను బీజేపీతో ముడిపెట్టొద్దు: అన్నామలై

Updated Date - Apr 11 , 2026 | 09:33 PM