Share News

నితీశ్ కమారుడికి మంత్రి పదవి... 7న క్యానిబెట్ విస్తరణ

ABN , Publish Date - May 06 , 2026 | 06:18 PM

బీహార్‌లో ఈనెల 7న కీలక మంత్రివర్గ విస్తరణ జరుగనుంది. గాంధీ మైదానంలో పెద్దఎత్తున ప్రమాణస్వీకార కార్యాక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నారు. బిహార్ మాజీ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తనయుడు నిశాంత్ కుమార్‌ మంత్రివర్గంలో చేరే అవకాశం ఉంది.

నితీశ్ కమారుడికి మంత్రి పదవి... 7న క్యానిబెట్ విస్తరణ
Nitish and Nishant

పాట్నా: బీహార్‌లో ఈనెల 7న కీలక మంత్రివర్గ విస్తరణ జరుగనుంది. గాంధీ మైదానంలో పెద్దఎత్తున ప్రమాణస్వీకార కార్యాక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నారు. బిహార్ మాజీ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తనయుడు నిశాంత్ కుమార్‌ (Nishant Kuamr) మంత్రివర్గంలో చేరే అవకాశం ఉంది. జేడీయీ నేతలు మంగళవారం రాత్రి జరిపిన సమావేశంలో ప్రభుత్వంలో చేరాలని నిశాంత్‌ను ఒప్పించినట్టు తెలుస్తోంది. ఢిల్లీ నుంచి పాట్నా వచ్చిన కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ సహా, జేడీయూ నేతలు ప్రస్తుతం 7 సర్క్యులర్ రోడ్డులోని నితీశ్ కుమార్ నివాసంలో సమావేశం జరుపుతున్నారు. ఈ సమావేశంలో మంత్రుల తుది జాబితాను ఆమోదించనున్నట్టు తెలుస్తోంది.


మంత్రివర్గంలో చేరేందుకు నిశాంత్ అంగీకారం

చాలాకాలంగా యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరంగా ఉంటున్న నిశాంత్ ప్రభుత్వంలో చేరేందుకు కూడా తొలుత నిరాకరించారు. అయితే మంగళవారంనాడు జరిగిన జేడీయూ సమావేశంలో సీనియర్ నేతలు ఆయనను ప్రభుత్వంలో చేరేందుకు ఒప్పించినట్టు తెలిసింది. ప్రభుత్వంలో ఆయన చేరడం పార్టీకి, రాష్ట్రానికి కూడా కీలకమని నచ్చచెప్పినట్టు సమాచారం. నిశాంత్ ప్రస్తుతం ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు, నితీశ్ హయాంలో జరిగిన అభివృద్ధి పనుల ఫీడ్‌బ్యాక్‌ను సేకరించేందుకు పలు జిల్లాల్లో 'బిహార్ గుడ్‌విల్ యాత్ర' జరుపుతున్నారు. ఆయన గత మే 8న లాంఛనంగా జేడీయూలో చేరారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ ఝా ఆయనకు సభ్యత్వాన్ని అందజేశారు.


మంత్రివర్గంలో 27 మందికి చోటు

కాగా, బిహార్ మంత్రివర్గ విస్తరణలో 27 మందికి చేటు కల్పించనున్నారు. బీజేపీ నుంచి 12 మంది, జేడీయూ నుంచి 11 మంది, ఎల్‌జేపీ (రామ్‌విలాస్) నుంచి ఇద్దరు, హెచ్ఏఎం, ఆర్ఎల్ఎస్‌పీ నుంచి చెరొకరికి మంత్రివర్గంలో చోటు కల్పించనున్నారు.


ఇవి కూడా చదవండి..

సంఖ్యా బలం కావాలి.. విజయ్‌కు గవర్నర్ అనుమతి నిరాకరణ

విజయ్ టీవీకేతో కాంగ్రెస్ పొత్తుపై కనిమొళి కీలక వ్యాఖ్యలు

Updated Date - May 06 , 2026 | 06:22 PM