Share News

విజయ్ టీవీకేతో కాంగ్రెస్ పొత్తుపై కనిమొళి కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - May 06 , 2026 | 03:42 PM

ఎన్నికలకు ముందు డీఎంకేతో పొత్తుతో కాంగ్రెస్ పోటీ చేసి 5 స్థానాల్లో గెలిచింది. అయితే ఎన్నికల అనంతరం టీవీంకేతో జత కట్టింది. తాజా పరిణామాలపై డీఎంకే ఎంపీ కనిమొళి స్పందించారు.

విజయ్ టీవీకేతో కాంగ్రెస్ పొత్తుపై కనిమొళి కీలక వ్యాఖ్యలు
Kanimozhi with Vijay

చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల అనంతరం కొత్త పొత్తులు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ సారథ్యంలో టీవీకే తాజాగా ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతుండటంతో ఆ పార్టీకి కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. దీంతో టీవీకేతో కాంగ్రెస్ పొత్తు ఖరారైంది. ఎన్నికలకు ముందు డీఎంకేతో పొత్తుతో కాంగ్రెస్ పోటీ చేసి 5 స్థానాల్లో గెలిచింది. అయితే ఎన్నికల అనంతరం టీవీంకేతో జత కట్టింది. తాజా పరిణామాలపై డీఎంకే ఎంపీ కనిమొళి (Kanimozhi) స్పందించారు. తమ భాగస్వామ్య పార్టీలకు ఎవరితో కలిసి వెళ్లాలో నిర్ణయించుకునే హక్కు ఉందని అన్నారు.


'మేము (కాంగ్రెస్-డీఎంకే) చాలా ఎన్నికలు కలిసి పనిచేశాం. ఇవాళ కూ డా ఎన్నికల్లో కలిసి పోటీచేసి ఓటమి చవిచూశాం. ప్రతి పార్టీ తమకు ఏదైతే సరైనదని అనిపిస్తుందో అది చేసే హక్కు ఉంటుంది. ఇతరుల గురించి నేను చెప్పేమీ లేదు. మేము మాత్రం మా పోరాటం కొనసాగిస్తాం' అని మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కనిమొళి తెలిపారు.


భాగస్వామ్యులు ఎప్పుడూ కలిసి ఉండేందుకు డీఎంకే స్టాలిన్ ప్రాధాన్యం ఇస్తుంటారని కనిమొళి చెప్పారు. తమది సైద్ధాంతిక కూటమి అని చెప్పారు. టీవీకే సెక్యులర్ పార్టీగా చెప్పుకోవడంపై అడిగినప్పుడు తమిళనాడులో రాజకీయాల్లో మరో సెక్యులర్ పార్టీ వస్తే తమకు ఎలాంటి భయం లేదన్నారు.


డీఎంకే ఓటమిపై మాట్లాడుతూ, ఫలితాలపై తప్పనిసరిగా డీఎంకే విశ్లేషించుకుంటుందని అన్నారు. ఓటమికి కారణాలు ఇప్పుడే చెప్పలేమని, అయితే వీటిపై విశ్లేషణ చేసుకోవడం చాలా కీలకమని అన్నారు. తమిళనాడు ప్రజలు మార్పును కోరుకున్నారని, విజయ్‌కు తమ అభినందనలని చెప్పారు. ప్రజలు ఏమి కోరుకుంటున్నారో అలాంటి ప్రభుత్వాన్ని టీవీకే అందిస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. డీఎంకే చాలా ఎన్నికలు చూసిందని, ఎన్నో విజయాలు, మరెన్నో పరాజయాలు చూసిందని, ముందుకు ఎలా వెళ్లాలనేది పార్టీకి బాగా తెలుసునని చెప్పారు. ఈ ఎన్నికల్లో డీఎంకే 234 స్థానాల్లో పోటీచేసి కేవలం 59 సీట్లు గెలుచుకుంది. డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ సైతం కొలత్తూరు కంచుకోటలో ఓటమి చవిచూశారు.


ఇవి కూడా చదవండి..

విజయ్‌కు గవర్నర్‌ ఆహ్వానం.. ప్రమాణ స్వీకారానికి రాహుల్

తిరుచ్చి ఈస్ట్ నుంచి విజయ్ రాజీనామా.! మరి ఆ స్థానం ఎవరికి?

Updated Date - May 06 , 2026 | 04:48 PM