Share News

భారీ నిర్మాణాలపై రెండేళ్ల నిషేధం.. నీతి ఆయోగ్ స్పందన ఏంటంటే..

ABN , Publish Date - May 12 , 2026 | 09:39 PM

పశ్చిమాసియా సంక్షోభం కారణంగా దేశవ్యాప్తంగా భారీ నిర్మాణ పనులపై రెండేళ్ల నిషేధం విధించాలని కేంద్రానికి సిఫారసు చేసినట్టు వస్తున్న వార్తలను నీతి ఆయోగ్ ఖండించింది. ఈ ప్రచారంలో నిజం లేదని తేల్చి చెప్పింది

భారీ నిర్మాణాలపై రెండేళ్ల నిషేధం.. నీతి ఆయోగ్ స్పందన ఏంటంటే..
Construction ban news

పశ్చిమాసియా సంక్షోభం కారణంగా దేశవ్యాప్తంగా భారీ నిర్మాణ పనులపై రెండేళ్ల నిషేధం విధించాలని కేంద్రానికి సిఫారసు చేసినట్టు వస్తున్న వార్తలను నీతి ఆయోగ్ ఖండించింది. ఈ ప్రచారంలో నిజం లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు నీతి ఆయోగ్ 'ఎక్స్' వేదికగా ఓ పోస్ట్ పెట్టింది (NITI Aayog).


పశ్చిమాసియాలో సంక్షోభం భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో.. నిర్మాణ ప్రాజెక్టులను తాత్కాలికంగా నిలిపివేయాలని కేంద్రానికి నీతి ఆయోగ్ సూచించిందని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. నిర్మాణ భవన్, ఉద్యోగ్ భవన్, శాస్త్రి భవన్ వంటి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల పునర్నిర్మాణ ప్రాజెక్టులను కూడా నిలిపివేయాలని నీతి ఆయోగ్ సూచించినట్టు ఆ కథనాలు పేర్కొన్నాయి. ఈ వార్తలపై స్పందించిన నీతి ఆయోగ్.. 'అలాంటి సిఫారసులను ఏ రూపంలోనూ చేయలేదు' అని స్పష్టం చేసింది (Construction ban news).


సంబంధిత భవనాల పునర్నిర్మాణ ప్రక్రియ మొత్తం ఆయా మంత్రిత్వ శాఖల పరిధిలో కొనసాగుతోందని, వాటిని వాయిదా వేయాలని తాము ఎటువంటి సూచనలు ఇవ్వలేదని తెలిపింది (NITI clarification). ఇంధన ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో వాడకాన్ని తగ్గించుకోవాలని, విదేశీ ప్రయాణాలను పరిమితం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే భారీ ప్రాజెక్టుల నిర్మాణాలను కూడా నిషేధించాలని నీతి ఆయోగ్ సూచించినట్టు వార్తలు వచ్చాయి.


ఇవి కూడా చదవండి..

విద్యార్థుల కష్టాన్ని, కలలను బీజేపీ ప్రభుత్వం కాలరాసింది: రాహుల్ గాంధీ


ముళ్ల కంచెలకు భయపడం.. బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ..

Updated Date - May 12 , 2026 | 09:50 PM