Share News

ఆపరేషన్ సిందూర్‌ సమయంలో పా‌క్‌కు చైనా సాయం.. భారత్ స్పందన ఏంటంటే..

ABN , Publish Date - May 12 , 2026 | 07:31 PM

ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు చైనా సహాయం చేసినట్టు తమకు ముందే తెలుసని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. చైనా సహాయాన్ని ధ్రువీకరించే కథనాలను తాము చూశామని భారత్ విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు.

ఆపరేషన్ సిందూర్‌ సమయంలో పా‌క్‌కు చైనా సాయం.. భారత్ స్పందన ఏంటంటే..
Randhir Jaiswal

ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు చైనా సహాయం చేసినట్టు తమకు ముందే తెలుసని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. చైనా సహాయాన్ని ధ్రువీకరించే కథనాలను తాము చూశామని భారత్ విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. ఉగ్రవాదులకు అండగా నిలుస్తున్న దేశాలకు మద్దతు పలకడం తగదని చైనాకు పరోక్షంగా హితవు పలికారు (China Pakistan support).


'పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత్‌లో దాడులకు పాల్పడుతున్నారు. పహల్గాంలోని ఉగ్ర దాడులకు ఆపరేషన్ సిందూర్ ఓ ప్రణాళికాబద్దమైన ప్రతిస్పందన. ఉగ్రవాదులను పూర్తిగా నిర్మూలించాలంటే అక్కడి మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడమే ఏకైక మార్గం. దేశ సైనికులు అదే పని చేశారు. అటువంటి ఉగ్ర స్థావరాలను రక్షించేందుకు సహాయం చేయడం సరైనదో, కాదో ఆయా దేశాలే ఆలోచించుకోవాలి' అని జైస్వాల్ పేర్కొన్నారు (India rebukes China).


ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు చైనా సాంకేతిక సహాయం అందించినట్టు ఆ దేశ మీడియా ధ్రువీకరించింది (Pakistan terror infrastructure). ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ఆఫ్ చైనాకు చెందిన ఇంజినీర్ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. భారత్ దాడులు చేసిన సమయంలో తమ బృందం పాకిస్థాన్‌తో కలిసి పని చేసిందని ఆయన చెప్పారు.


ఇవి కూడా చదవండి..

విద్యార్థుల కష్టాన్ని, కలలను బీజేపీ ప్రభుత్వం కాలరాసింది: రాహుల్ గాంధీ


ముళ్ల కంచెలకు భయపడం.. బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ..

Updated Date - May 12 , 2026 | 07:31 PM