ఢిల్లీ పోలీసులపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ సీరియస్
ABN , Publish Date - Jul 29 , 2026 | 07:12 AM
జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టిన విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు విచక్షణా రహితంగా బలప్రయోగానికి పాల్పడిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
న్యూఢిల్లీ, జూలై 28: జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టిన విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు విచక్షణా రహితంగా బలప్రయోగానికి పాల్పడిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై మితిమీరిన బలాన్ని ప్రయోగించడం ప్రాథమిక మానవ హక్కులను ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. ఈ నెల 20న కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఆందోళనలో నిరసనకారులపై పోలీసుల లాఠీచార్జి, బాష్పవాయు ప్రయోగంపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ సుమోటోగా స్పందించి.. ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు ఈ నెల 25న నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది.