ఇది ఇండియా కాదు.. నేపాల్.. గుట్కా ఉమ్మిన భారతీయుడికి ఎలాంటి అనుభవం ఎదురైందంటే..
ABN , Publish Date - Apr 09 , 2026 | 12:28 PM
నేపాల్‌లో గుట్కా నమిలి రోడ్డుపై ఉమ్మిన భారతీయ పర్యాటకులను ఓ స్థానిక వ్యక్తి నిలదీశాడు. వారి చేత రోడ్డును శుభ్రం చేయించాడు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నేపాల్‌లో గుట్కా నమిలి రోడ్డుపై ఉమ్మిన భారతీయ పర్యాటకులను ఓ స్థానిక వ్యక్తి నిలదీశాడు. వారి చేత రోడ్డును శుభ్రం చేయించాడు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నేపాల్ పర్యటనకు వెళ్లిన కొందరు భారతీయులు అక్కడ కారులో వెళుతూ గుట్కా నమిలి రోడ్డుపై ఉమ్మేశారు. దానిని ఓ వ్యక్తి గమనించి వారి వాహనాన్ని ఆపి నిలదీశాడు (Nepali man Indian tourists gutka video).
నీళ్లతో ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయించాడు. 'ఇది ఇండియా కాదు సోదరా.. నేపాల్. త్వరగా నీళ్ళు పోయండి' అని చెబుతున్నాడు. భారతీయ పర్యాటకులు పదే పదే క్షమాపణలు చెబుతున్నా వినకుండా ఆ ప్రాంతాన్ని నీటితో శుభ్రం చేయించాడు. ఈ ఘటనను వీడియో తీస్తున్న వ్యక్తి.. 'మీరు భారతదేశం నుంచి వచ్చారు. అంత పెద్ద దేశం నుంచి వచ్చి ఇక్కడ చెత్తంతా వ్యాపింపజేశారు' అని చెబుతున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లక్షల మంది వీక్షించి ఈ వీడియోపై తమ అభిప్రాయాన్ని తెలియజేశారు (Viral Nepal cleanliness video).
పరిశుభ్రత విషయంలో చొరవ చూపిన ఆ నేపాలీ వ్యక్తిని కొందరు ప్రశంసించారు (Gutka spitting issue). మరికొందరు మాత్రం.. అతడు చాలా కఠినంగా వ్యవహరించాడని విమర్శించారు. ఒకరు చేసిన తప్పు వల్ల భారతదేశం మొత్తాన్ని నిందించడం సరికాదని హితవు పలికారు. 'చాలా మంది నేపాలీలు మా దేశానికి వచ్చి, ఇక్కడ పనిచేసి, ఇక్కడే ఉంటారు. మేము వారిని గానీ, వారి దేశాన్ని గానీ అగౌరవపరచము. అవును.. ఆ పర్యాటకులు తప్పు చేశారు. కానీ, వారు క్షమాపణలు చెబుతున్నారు. అయినప్పటికీ, మీరు దేశం మొత్తాన్ని ఉద్దేశపూర్వకంగా నిందిస్తున్న తీరు స్పష్టంగా ద్వేషాన్ని చూపిస్తోంది. మీ దేశంలోని అతిథులతో మీరు ప్రవర్తిస్తున్న తీరు చాలా విచారకరం' అని ఒకరు కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. మళ్లీ హోర్ముజ్‌ను మూసేసిన ఇరాన్..
పాకిస్థాన్‌పై మాకు నమ్మకం లేదు.. ఇజ్రాయెల్ రాయబారి సంచలన వ్యాఖ్యలు..