పాకిస్థాన్‌పై మాకు నమ్మకం లేదు.. ఇజ్రాయెల్ రాయబారి సంచలన వ్యాఖ్యలు..
ABN , Publish Date - Apr 09 , 2026 | 12:00 PM
అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ కూడా మద్దతు పలికిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఒప్పందంలో మధ్యవర్తిత్వ పాత్ర పోషించిన పాకిస్థాన్‌పై తమకు నమ్మకం లేదని పేర్కొంది.
అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ కూడా మద్దతు పలికిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఒప్పందంలో మధ్యవర్తిత్వ పాత్ర పోషించిన పాకిస్థాన్‌పై తమకు నమ్మకం లేదని ఆ దేశ రాయబారి పేర్కొన్నారు. భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ తాజాగా మాట్లాడుతూ.. శాంతి చర్చల్లో పాక్ పాత్రపై సందేహం వ్యక్తం చేశారు (Israel envoy Pakistan criticism).
పాకిస్థాన్‌ను తాము విశ్వసించలేమని, అమెరికా తన స్వప్రయోజనాల కోసం ఆ దేశాన్ని మధ్యవర్తిగా ఉపయోగించుకోవాలని నిర్ణయించుకుందని తాను భావిస్తున్నట్టు అజార్ పేర్కొన్నారు. ఏదేమైనా ఇరాన్‌లో తాము అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు అమెరికాతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే అమెరికా-మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ మద్దతు ఇస్తోందన్నారు (Iran US truce controversy).
కాల్పుల విరమణ ఒప్పందం ఇరాన్ వరకే పరిమితం అని, లెబనాన్‌పై తమ దాడులు కొనసాగుతాయని ఇజ్రాయెల్ రాయబారి వెల్లడించారు (Lebanon exclusion ceasefire). ఇరాన్‌పై జరిపిన ఆపరేషన్‌కు, లెబనాన్‌కు ఎలాంటి సంబంధమూ లేదని తెలిపారు. దక్షిణ లెబనాన్ ప్రాంతం నుంచి హెజ్‌బొల్లా మౌలిక సదుపాయాలను పూర్తిగా తొలగించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. మళ్లీ హోర్ముజ్‌ను మూసేసిన ఇరాన్..
పసిడి ప్రియులకు అలర్ట్.. పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..