అప్పటివరకు అమెరికా బలగాలు ఇరాన్ చుట్టూనే ఉంటాయి: డొనాల్డ్ ట్రంప్
ABN , Publish Date - Apr 09 , 2026 | 11:02 AM
అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ పూర్తిగా ఒప్పందాన్ని అమలు చేసే వరకు అమెరికా సైనిక బలగాలు అక్కడే కొనసాగుతాయని తెలిపారు.
అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ పూర్తిగా ఒప్పందాన్ని అమలు చేసే వరకు అమెరికా సైనిక బలగాలు అక్కడే కొనసాగుతాయని తెలిపారు. ఇరాన్-అమెరికా మధ్య బుధవారం రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ తమ దేశానికి చెందిన యుద్ధ నౌకలు, విమానాలు, సైనికులు, ఆయుధాలు మొదలైనవి ఇరాన్ పరిసర ప్రాంతాల్లోనే ఉంటాయని ట్రంప్ పేర్కొన్నారు (Trump US forces Iran).
యుద్ధం ముగింపునకు సంబంధించి పూర్తి స్థాయి ఒప్పందం అమలయ్యేంత వరకు సైనికులు వెనక్కి రారని ట్రంప్ తెలిపారు. ఒకవేళ ఒప్పందాన్ని ఇరాన్ పాటించకపోతే మునుపెన్నడూ చూడని స్థాయిలో విరుచుకుపడతామని హెచ్చరించారు. హోర్ముజ్ జలసంధి మార్గం సురక్షితంగా ఉండాలని, నౌకాయానం నిరంతరం కొనసాగాలని అన్నారు. ఒప్పందం కుదిరేవరకు అమెరికా సైన్యం అక్కడే విశ్రాంతి తీసుకుంటూ, తమ తదుపరి మిషన్ కోసం ఎదురుచూస్తుందన్నారు (Iran ceasefire compliance).
మరోవైపు తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ, లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు భారీగా కొనసాగుతున్నాయి (Trump warning Iran deal). ఇజ్రాయెల్ దాడుల్లో కనీసం 254 మంది మరణించినట్టు వార్తలు వస్తున్నాయి. 1,100 మందికి పైగా గాయపడ్డారని సమాచారం. ముఖ్యంగా బీరుట్, దక్షిణ లెబనాన్ ప్రాంతాల్లో నష్టం మరింత తీవ్రంగా ఉందని వార్తలు వస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. మళ్లీ హోర్ముజ్‌ను మూసేసిన ఇరాన్..
పసిడి ప్రియులకు అలర్ట్.. పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..