Share News

నష్టాల్లో దేశీయ సూచీలు.. సెన్సెక్స్ 800 పాయింట్లు డౌన్

ABN , Publish Date - Apr 09 , 2026 | 10:03 AM

పశ్చిమాసియాలో సద్దుమణిగాయనుకున్న ఉద్రిక్తతలు తిరిగి మొదలుకావడంతో అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు, దీంతో ఇరాన్ తిరిగి హోర్ముజ్‌ను మూసేయడం నెగిటివ్‌గా మారింది.

నష్టాల్లో దేశీయ సూచీలు.. సెన్సెక్స్ 800 పాయింట్లు డౌన్
Stock Market

పశ్చిమాసియాలో సద్దుమణిగాయనుకున్న ఉద్రిక్తతలు తిరిగి మొదలుకావడంతో అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు, దీంతో ఇరాన్ తిరిగి హోర్ముజ్‌ను మూసేయడం నెగిటివ్‌గా మారింది. దీంతో బుధవారం భారీ లాభాలను ఆర్జించిన సూచీలు మళ్లీ గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. దీంతో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో కదలాడుతున్నాయి (Indian stock market).


గత సెషన్ ముగింపు (77,562)తో పోల్చుకుంటే గురువారం ఉదయం దాదాపు 300 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత కిందకు వెళ్లింది. మళ్లీ 77 వేల మార్క్ దిగువకు పడిపోయింది. ప్రస్తుతం ఉదయం 10:00 గంటల సమయంలో సెన్సెక్స్ 800 పాయింట్ల నష్టంతో 76,762 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా నష్టాల బాటలోనే సాగుతోంది. ప్రస్తుతం 200 పాయింట్ల నష్టంతో 23,797 వద్ద కదలాడుతోంది (stock market news today).


సెన్సెక్స్‌, నిఫ్టీలో హిందోల్కా, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, వేదాంత, నాల్కో, భెల్ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). ఇన్ఫో ఎడ్జ్, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, అంబుజా సిమెంట్స్, ఎటర్నల్, అంబర్ ఎంటర్‌ప్రైజెస్ మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 338 పాయింట్ల నష్టంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 542 పాయింట్ల నష్టంతో ఉంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 92.61గా ఉంది.


ఇవి కూడా చదవండి..

లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. మళ్లీ హోర్ముజ్‌ను మూసేసిన ఇరాన్..


పసిడి ప్రియులకు అలర్ట్.. పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Apr 09 , 2026 | 10:03 AM