Share News

నీట్ పేపర్ లీక్.. పుణె బోటనీ టీచర్ అరెస్ట్..

ABN , Publish Date - May 16 , 2026 | 05:14 PM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మరో కీలక సూత్రధారి, పుణెకు చెందిన బయాలజీ టీచర్ మనీషా మందారేను సీబీఐ (CBI) అరెస్ట్ చేసింది. ఆమె నీట్ బయాలజీ ప్రశ్నపత్రం లీక్‌ కావడంలో కీలక పాత్ర పోషించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

నీట్ పేపర్ లీక్.. పుణె బోటనీ టీచర్ అరెస్ట్..
NEET UG 2026 paper leak

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మరో కీలక సూత్రధారి, పుణెకు చెందిన బోటనీ టీచర్ మనీషా మందారేను సీబీఐ (CBI) అరెస్ట్ చేసింది. ఆమె నీట్ బయాలజీ ప్రశ్నపత్రం లీక్‌ కావడంలో కీలక పాత్ర పోషించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. పుణెకు చెందిన మనీషా బోటనీ విభాగంలో సీనియర్ అధ్యాపకురాలు (NEET UG 2026 paper leak).


మనీషాను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నీట్ ప్రక్రియలో సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్‌గా నియమించింది. ఏప్రిల్ నుంచి ఆమె కొందరు నీట్ అభ్యర్థులకు తన ఇంటి వద్దే శిక్షణా తరగతులను నిర్వహించారు. ఆ సమయంలోనే ఆమె వారికి నీట్ పరీక్షకు సంబంధించిన బోటనీ, జువాలజీ పేపర్లలోని ప్రశ్నలను లీక్ చేశారు. ఆ ప్రశ్నలను నోట్ బుక్‌లో రాసుకోవాలని, టెక్ట్స్ బుక్‌లో మార్క్ చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు (Manisha Mandhare arrested).


ఆమె లీక్ చేసిన ప్రశ్నలు మే 3వ తేదీన జరిగిన నీట్ పరీక్షలోని ప్రశ్నలతో సరిపోలినట్టు సీబీఐ అధికారులు వెల్లడించారు (CBI NEET investigation). ఇప్పటికే ఈ కేసులో పుణెకు చెందిన కెమిస్ట్రీ లెక్చరర్ పీవీ కులకర్ణిని కూడా సీబీఐ అరెస్ట్ చేసింది. కులకర్ణి గత కొన్నేళ్లుగా నీట్ ప్రశ్నాపత్రం రూపొందించే అధికారిక నిపుణుల కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. కాగా, నీట్ ప్రశ్నాప్రతం లీకేజీ వ్యవహారంలో ఇప్పటివరకు ఢిల్లీ, జైపూర్, నాసిక్, పుణె, గురుగ్రామ్, అహిల్యానగర్ నుంచి తొమ్మిది మందిని సీబీఐ అరెస్ట్ చేసింది.


ఇవి కూడా చదవండి..

తైవాన్ కోసం చైనాతో యుద్ధం చేయలేం: ట్రంప్


పాక్ తీరు మారకుంటే.. చరిత్రలో కలిసిపోతుంది: భారత ఆర్మీ చీఫ్

Updated Date - May 16 , 2026 | 07:02 PM