నీట్ పేపర్ లీక్.. 13 మంది అరెస్ట్
ABN , Publish Date - May 12 , 2026 | 01:34 PM
రాజస్థాన్‌లోని సికార్‌లో నీట్ పేపర్ లీక్ కేసు వ్యవహారంలో 13 మందిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వీరిని పోలీసులు విచారిస్తున్నారు. 'గెస్ పేపర్' పేరుతో మార్కెట్‌లోకి ఈ నీట్ ప్రశ్నాపత్రం వచ్చింది.
జైపూర్, మే12: రాజస్థాన్‌లోని సికార్‌లో నీట్ పేపర్ లీక్ కేసు వ్యవహారంలో 13 మందిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వీరిని పోలీసులు విచారిస్తున్నారు. 'గెస్ పేపర్' పేరుతో మార్కెట్‌లోకి ఈ నీట్ ప్రశ్నాపత్రం వచ్చింది. ప్రభుత్వం నిర్వహించిన ప్రశ్నాపత్రంతో ఈ ‘గెస్ పేపర్’ 100 శాతం సరి పోలినట్లు అధికారులు గుర్తించారు. అలాగే మే 3వ తేదీన ఈ నీట్ పరీక్ష నిర్వహించగా.. అంతకు ముందే ఈ పరీక్ష పేపర్ లీక్ అయినట్లు అధికారులు ధృవీకరించారు.
ఈ ప్రశ్నాపత్రం రూ. 20 వేల నుంచి రూ. 2 లక్షల వరకు విక్రయించినట్లు గుర్తించారు. కేరళలోని ఒక ఎంబీబీఎస్ విద్యార్థి వద్ద ఈ పేపర్ లీక్ అయినట్లు పోలీసులు కనుగొన్నారు. మే 1వ తేదీన సికార్‌లోని స్నేహితుడితో ఎంబీబీఎస్ విద్యార్థి ఈ ప్రశ్నాపత్రం పంచుకున్నట్లు తెలుస్తుంది. ఆ తర్వాత కోచింగ్ సెంటర్లు, అభ్యర్థులకు ఈ పేపర్ లీక్ అయినట్లు సమాచారం.
ఫైనల్ పరీక్షల్లో అసలు ప్రశ్నాపత్రంలోని 140 ప్రశ్నలు సరి పోలాయి. ఈ 140 ప్రశ్నలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరలయ్యాయి. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం ఈ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ పరీక్ష నిర్వహించే తేదీలు త్వరలో ప్రకటిస్తామని వెల్లడించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
సోనియాతో భేటీ కానున్న కేరళ నేతలు.. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై చర్చ
ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి
For More National News And Telugu News