పార్లమెంటు ఆవరణలో ఎన్డీయే మహిళా ఎంపీల ధర్నా
ABN , Publish Date - Apr 17 , 2026 | 09:38 PM
మహిళలకు 2029 నుంచి చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ అమలు చేసేలా కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోవడంతో ఎన్డీయే మహిళా ఎంపీలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పార్లమెంటు ఆవరణలో ధర్నాకు దిగారు.
న్యూఢిల్లీ: మహిళలకు 2029 నుంచి చట్టసభల్లో 33 శాతం రిజర్వేషనల్ అమలు చేసేలా కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోవడంతో ఎన్డీయే మహిళా ఎంపీలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పార్లమెంటు ఆవరణలో ధర్నాకు దిగారు. కావాలనే విపక్షాలు మహిళా బిల్లును ఓడించాయని, దీనిని మహిళలు ఎప్పటికీ క్షమించరని పలువురు మహిళా ఎంపీలు ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లుకు మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం కాగా, ఓటింగ్ ప్రక్రియలో 528 మంది సభ్యులు పాల్గొన్నారు. బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 మంది ఓటు వేశారు. దీంతో మెజారిటీకి అవసరమైన 352 మంది సభ్యుల బలం లేకపోవడంతో 54 ఓట్లు తేడాతో బిల్లు వీగిపోయినట్టు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ఆ వెంటనే డీలిమిటేషన్ బిల్లు-2026, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు-2026ను వెనక్కి తీసుకున్నట్టు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు.
ఇవి కూడా చదవండి..
వీగిపోయిన మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు
ఇండి కూటమి సభ్యులు బిల్లును వ్యతిరేకించారు: అమిత్ షా