15న ఆదిచుంచనగిరికి ప్రధాని మోదీ
ABN , Publish Date - Apr 08 , 2026 | 01:40 PM
మండ్య జిల్లా నాగమంగల తాలూకాలోని చారిత్రాత్మక గుర్తింపు కల్గిన ఆదిచుంచనగిరి మఠం పీఠాధ్యక్షుడిగా కొనసాగిన బాలగంగాధరనాథస్వామిజీ సమాధిని శ్రీ గురుభైరవైక్య మందిరం ప్రారంభానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ 15వ తేదీన రానున్నారు.
బెంగళూరు: మండ్య జిల్లా నాగమంగల తాలూకాలోని చారిత్రాత్మక గుర్తింపు కల్గిన ఆదిచుంచనగిరి మఠం పీఠాధ్యక్షుడిగా కొనసాగిన బాలగంగాధరనాథస్వామిజీ సమాధిని శ్రీ గురుభైరవైక్య మందిరం ప్రారంభానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ 15వ తేదీన రానున్నారు. ప్రధానమంత్రి రాష్ట్ర పర్యటనకు సుదీర్ఘకాలం తర్వాత విచ్చేస్తున్నారు. ఆదిచుంచనగిరి పరిధిలోని కాలభైరవేశ్వరస్వామి ఆలయానికి సమీపంలోనే భైరవైక్య డాక్టర్ బాలగంగాధరనాథస్వామీజీని సమాధి చేసిన విషయం తెలిసిందే.
స్వామీజీ భైరవైక్యం చెందినప్పుడు తాత్కాలికంగా మండపాన్ని నిర్మించారు. ఆ తర్వాత మూల సమాధిని యథాస్థితిలో ఉంచి మండపాన్ని తొలగించారు. రెండు అంతస్తులతో ప్రస్తుతం మందిరాన్ని తీర్చిదిద్దారు. ఈ మండపాన్ని ప్రారంభించేందుకు ప్రధానమంత్రి 15న విచ్చేయనున్నారని మఠం ఒక ప్రకటనలో పేర్కొంది. బుధవారం ఉదయం 11 గంటలకు మండపాన్ని ప్రారంభించే ప్రధానమంత్రి బీజీఎస్ స్టేడియంలో ప్రత్యేక వేదిక ద్వారా భక్తులనుద్దేశించి ప్రసంగించనున్నారు.
ఆదిచుంచనగిరి మఠం ప్రస్తుత పీఠాధిపతి నిర్మలానందనాధస్వామీజీ కార్యక్రమాన్ని పర్యవేక్షించనున్నారు. కార్యక్రమంలో మాజీ ప్రధాని దేవేగౌడ, కేంద్రమంత్రి కుమారస్వామి సహా జిల్లా మంత్రి చలువరాయస్వామి, రాష్ట్రంలోని వివిధ మఠాల స్వామీజీలు పాల్గొననున్నారు. ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లాధికారి డాక్టర్ కుమార్, ఎస్పీ డాక్టర్ శోభారాణి మఠాన్ని సందర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
మందుబాబులకు చేదు వార్త.. మూడు రోజులు షాపులు బంద్
కమల్‌ను ప్రచారానికి ఆహ్వానించిన సీపీఎం
Read Latest Telangana News and National News