Share News

రాజీపడే ప్రధాని దేశ గౌరవాన్ని కాపాడలేరు.. మోదీపై రాహుల్ ఫైర్

ABN , Publish Date - Jun 14 , 2026 | 08:14 PM

అమెరికా దాడుల్లో ముగ్గురు భారతీయ నావికుకులు మరణించడంపై అగ్రదేశం తీరు, ప్రధాన వైఖరిపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. అగ్రరాజ్యం ఆదేశాలకు ప్రధాని లొంగిపోయారని అన్నారు.

రాజీపడే ప్రధాని దేశ గౌరవాన్ని కాపాడలేరు.. మోదీపై రాహుల్ ఫైర్
Rahul with PM Modi

న్యూఢిల్లీ: అమెరికా దాడుల్లో ముగ్గురు భారతీయ నావికుకులు మరణించడంపై అగ్రదేశం తీరు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వైఖరిపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర విమర్శలు గుప్పించారు. అగ్రరాజ్యం ఆదేశాలకు ప్రధాని లొంగిపోయారని అన్నారు. రాజీపడే ప్రధాని దేశ గౌరవాన్ని ఎలా కాపాడగలుగుతారని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రశ్నించారు.


హోర్ముజ్ జలసంధి సమీపంలో తామ జరిపిన మిలటరీ దాడుల్లో ముగ్గురు భారతీయుల నౌకలు మరణించినప్పటికీ అమెరికా పశ్చాత్తాప పడటం కానీ క్షమాపణ చెప్పడం కానీ జరగలేదన్నారు. ఇందుకు బదులుగా ఆదేశాలు జారీ చేస్తోందని, మోదీ మాత్రం విధేయత చూపుతున్నారని అన్నారు.


అమెరికా ఆదేశాలను తక్షణం పాటించాలని, ఉల్లంఘలను సహించేది లేదని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో హెచ్చరించడాన్ని రాహుల్ తప్పుపట్టారు. వాషింగ్టన్ ఇస్తున్న ఆదేశాలను, ఆ దేశం వాడుతున్న భాషను ఏ సార్వభౌమాధికార దేశం అంగీకరించదన్నారు. ఇందుకు భిన్నంగా మోదీ విధేయ సేవకుడిగా, అమెరికా ఆదేశాలకు తలొగ్గుతున్నారని విమర్శించారు. రాజీపడే ప్రధాని దేశ గౌరవాన్ని ఎప్పటికీ కాపాడలేరని అన్నారు. దేశాన్ని అవమానించే వాళ్ల నియంత్రణలో ఆయన ఉన్నారని, దేశ ప్రజలంతా ఇది గమనించాలని రాహుల్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

కుమార్తెపై ఆన్‌లైన్ ప్రచారం.. బీజేపీ పనేనంటూ మండిపడిన డింపుల్ యాదవ్

అఖిలేష్ యాదవ్ కుమార్తెపై ట్రోలింగ్.. ఎఫ్ఐఆర్ నమోదుకు యోగి ఆదేశం

Updated Date - Jun 14 , 2026 | 08:36 PM