Share News

లిఫ్ట్‌లో పేలిన గ్యాస్ బెలూన్లు.. తృటిలో తప్పిన ప్రమాదం!

ABN , Publish Date - Feb 04 , 2026 | 08:08 PM

ముంబైలోని ఓ అపార్ట్‌మెంట్ లిఫ్ట్ లో జరిగిన సంఘటన అందరినీ షాక్ కి గురి చేసింది. లిఫ్ట్ లోకి గ్యాస్ బెలూన్లతో ఎంట్రీ ఇవ్వగా ఒక్కసారిగా పేలిపోయాయి. దీంతో లిఫ్ట్ లో భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి.

లిఫ్ట్‌లో పేలిన గ్యాస్ బెలూన్లు.. తృటిలో తప్పిన ప్రమాదం!
Gas Balloons blast in Lift

ఇంటర్నెట్ డెస్క్: ముంబై(Mumbai) మహానగరంలోని ఒక అపార్ట్‌మెంట్‌లో బుధవారం భారీ ప్రమాదం తప్పింది. గ్యాస్ బెలూన్ల(Gas balloons) కారణంగా లిఫ్టులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో నివాసితులు భయాందోళనకు గురయ్యారు. లిఫ్ట్ లోపల ఉన్న విద్యుత్ సరఫరా (Power supply) లేదా మరేదైనా వస్తువు తగిలి ఈ పేలుడు జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో అదృష్టం కొద్దీ ప్రాణపాయం తప్పింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


వీడియోలో ఏముందంటే..

మొదట లిఫ్ట్ లోకి ఓ మహిళ ప్రవేశించింది. ఆ తర్వాత బెలూన్లు పట్టుకొని ఒక వ్యక్తి, అతనితోపాటు మరో వ్యక్తి లిఫ్ట్‌లోకి ప్రవేశించారు. లిఫ్ట్ క్లోజ్ అవుతుండగానే ఒక్కసారిగా బెలూన్లు పేలిపోయి మంటలు వ్యాపించాయి. వెంటనే ముగ్గురు లిఫ్ట్ నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలైన‌ట్లు సమాచారం. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ (CCTV) కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. హైడ్రోజన్ గ్యాస్ నింపిన బెలూన్లు లిఫ్ట్‌లో తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:
గాల్లో విమానం.. అర్ధనగ్నంగా యువకుడి వీరంగం.. వీడియో వైరల్

మీ పరిశీలనా శక్తికి పరీక్ష.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 31 సెకెన్లలో కనిపెట్టండి

Updated Date - Feb 04 , 2026 | 08:40 PM