Share News

త్వరలో మొబైల్‌ రీచార్జ్‌ ధరల పెంపు!

ABN , Publish Date - Jul 07 , 2026 | 06:35 AM

దేశంలో ఫోన్‌ రీచార్జ్‌ ప్లాన్‌ల ధరలను పెంచేందుకు టెలికం కంపెనీలు సిద్ధమవుతున్నాయి. రానున్న 3-4 నెలల్లో మొబైల్‌ టారి్‌ఫలు 12-15 శాతం పెరిగే...

త్వరలో మొబైల్‌ రీచార్జ్‌ ధరల పెంపు!

  • 12-15 శాతం పెరిగే చాన్స్‌

న్యూఢిల్లీ, జూలై 6: దేశంలో ఫోన్‌ రీచార్జ్‌ ప్లాన్‌ల ధరలను పెంచేందుకు టెలికం కంపెనీలు సిద్ధమవుతున్నాయి. రానున్న 3-4 నెలల్లో మొబైల్‌ టారి్‌ఫలు 12-15 శాతం పెరిగే అవకాశముందని ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ సెంట్రమ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ రీసెర్చ్‌ వెల్లడించింది. మార్కెట్‌లో 3+1 ప్లేయర్లు (టెలికం కంపెనీలు) మాత్రమే ఉండటంతో ధరల పెంపు అనివార్యం కానుందని అభిప్రాయపడింది. ‘జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా కంపెనీలు తమ సగటు వినియోగదారు ఆదాయాన్ని (ఏఆర్‌పీయూ) పెంచుకోవడానికి.. 5జీ నెట్‌వర్క్‌ మౌలిక సదుపాయాలపై చేసిన వ్యయాన్ని తిరిగి రాబట్టుకోవడానికి ధరలు పెంపునకు మొగ్గు చూపుతున్నాయి. దేశంలో 90 శాతానికి పైగా జిల్లాల్లో జియో, ఎయిర్‌టెల్‌ 5జీ నెట్‌వర్క్‌ సేవలను అందిస్తున్నాయి. ఇక వొడాఫోన్‌ ఐడియా కూడా దాదాపు 100 నగరాలకు 5జీ సేవలను విస్తరించింది. జూన్‌ త్రైమాసికంలో 3 ప్రైవేటు టెలికం ఆపరేటర్ల ఏఆర్‌పీయూ 1-1.5 వరకు పెరిగే అవకాశముంది. వొడాఫోన్‌ ఐడియాను వెనక్కినెట్టి జియో, ఎయిర్‌టెల్‌లు తమ చందాదారుల మార్కెట్‌ వాటాను పెంచుకుంటూపోతున్నాయి. త్రైమాసిక ప్రాతిపదికన చూసినప్పుడు జియో కొత్తగా దాదాపు 70 లక్షల మంది చందాదారులను పెంచుకోవచ్చు. ఎయిర్‌టెల్‌ 50 లక్షలు, వొడాఫోన్‌ ఐడియా 2 లక్షల మంది కొత్త చందాదారులను చేర్చుకోవచ్చు’ అని అంచనా వేసింది.

ఈ వార్తలు కూడా చదవండి...

మెట్రో ఫేజ్-2పై కేంద్రమంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి లేఖ

కన్నెపల్లి పంపు దగ్గరకెళ్లి కేటీఆర్ నాటకమాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ సెటైర్లు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jul 07 , 2026 | 07:01 AM