Share News

పిల్లల భద్రత కోసం కొత్త చర్యలు.. కేంద్రం నోటీసుకు మెటా స్పందన..

ABN , Publish Date - Jul 08 , 2026 | 10:44 AM

తన సోషల్ మీడియా వేదికలపై చిన్నారుల భద్రతను మరింత బలోపేతం చేసేందుకు మెటా పలు కొత్త చర్యలను ప్రకటించింది. ఇటీవల భారత ప్రభుత్వం పంపిన నోటీసు అనంతరం మెటా ఈ నిర్ణయం తీసుకుంది.

పిల్లల భద్రత కోసం కొత్త చర్యలు.. కేంద్రం నోటీసుకు మెటా స్పందన..
Meta child safety

తన సోషల్ మీడియా వేదికలపై చిన్నారుల భద్రతను మరింత బలోపేతం చేసేందుకు మెటా పలు కొత్త చర్యలను ప్రకటించింది. ఇటీవల భారత ప్రభుత్వం పంపిన నోటీసు అనంతరం మెటా ఈ నిర్ణయం తీసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో బాలల లైంగిక దోపిడీకి సంబంధించిన ప్రకటనలు కనిపించాయన్న ఆరోపణల నేపథ్యంలో మెటా నుంచి కేంద్రం వివరణ కోరింది (Meta child safety).


నిబంధనలు ఉల్లంఘించిన ప్రకటనలు, అకౌంట్లను నిలిపివేసినట్లు మెటా వెల్లడించింది. తప్పుడు కంటెంట్ కారణంతో గతేడాది ప్రపంచవ్యాప్తంగా 40 లక్షలకు పైగా ఖాతాలను బ్యాన్ చేసినట్లు వెల్లడించింది. అలాగే భారత్‌లో గతేడాది 1.6 లక్షల ఖాతాలను తొలగించినట్టు పేర్కొంది. తప్పుడు కంటెంట్‌ను అడ్డుకునేందుకు మరింత కట్టుదిట్టంగా ఏఐ టెక్నాలజీని వినియోగించనున్నట్టు తెలిపింది (Instagram child safety).


భారత ప్రభుత్వ సంస్థలతోనూ, బాలల భద్రత కోసం పనిచేసే సంస్థలతోనూ సమన్వయాన్ని మరింత పెంచుతున్నట్లు మెటా తెలిపింది (Meta safety measures). భారతీయ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి ప్రకటనలు ప్రదర్శిస్తున్నట్టు వస్తున్న ఆరోపణలను మెటా ఖండించింది. తమ ప్లాట్‌ఫారమ్‌లలో బాలల లైంగిక దోపిడీకి సంబంధించిన కంటెంట్‌కు ఎలాంటి స్థానమూ లేదని స్పష్టం చేసింది.


ఇవి కూడా చదవండి..

అదృశ్యమైన పాకిస్థాన్ కార్గో విమానం.. అరేబియా సముద్రం‌లో గాలింపు..


స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jul 08 , 2026 | 11:10 AM