తుపాన్ ఎఫెక్ట్.. ఒక్కసారిగా గాల్లోకి ఎగిరిన వ్యక్తి.. వణికిస్తున్న వీడియో..
ABN , Publish Date - May 14 , 2026 | 12:23 PM
ఉత్తరప్రదేశ్‌లో భారీ తుపాన్ బీభత్సం సృష్టిస్తోంది. పిడుగులు, భారీ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 70 మంది మృతిచెందినట్లు సమాచారం. అంతేకాకుండా పలువురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లో భారీ తుపాన్ బీభత్సం సృష్టిస్తోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులు, భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభవించింది. సమాచారం ప్రకారం ఇప్పటివరకు దాదాపు 70 మంది మరణించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పలువురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రయాగ్‌రాజ్, భదోహి, ఫతేపూర్, సోన్‌భద్ర వంటి జిల్లాల్లో చెట్లు, గోడలు, విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో భారీ నష్టం జరిగింది.
ఈ ఘటనల మధ్య బరేలీ జిల్లాలో జరిగిన ఒక సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బమియానా గ్రామంలో తుపాను తీవ్రత ఎక్కువగా ఉండటంతో బలమైన గాలులు వీచాయి. ఆ సమయంలో బలమైన గాలుల కారణంగా ఒక రేకుల షెడ్‌తో పాటు ఓ వ్యక్తి కూడా గాలిలోకి ఎగిరిపోయినట్లు వీడియోలో కనిపిస్తోంది. అనంతరం ఆ వ్యక్తి కిందపడటంతో తీవ్ర గాయాలయ్యాయి. అతనిని నన్హేగా గుర్తించారు. ఈ వీడియో చూస్తే తుఫాను ఎంత తీవ్రంగా, ప్రమాదకరంగా ఉందో స్పష్టంగా అర్థమవుతోంది.
తుపాన్ పరిస్థితిపై స్పందించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బాధితులకు 24 గంటల్లోగా నష్టపరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే సహాయక చర్యలను వేగంగా పూర్తి చేసి, ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మద్యం మత్తులో వీరంగం.. యువకులకు స్థానికులు దేహశుద్ధి
కార్లు వదలి.. బస్సులు, మెట్రోల్లో ప్రయాణించండి: కేంద్రం కొత్త ఆంక్షలు
For More National News