Share News

ప్రధాని మోదీనే అతిపెద్ద చొరబాటుదారు

ABN , Publish Date - Mar 22 , 2026 | 07:02 AM

ప్రధాని మోదీనే అందరికంటే ‘అతిపెద్ద చొరబాటుదారు’ అని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. శనివారం రంజాన్‌ సందర్భంగా కోల్‌కతాలో నిర్వహించిన వేడుకల్లో...

ప్రధాని మోదీనే అతిపెద్ద చొరబాటుదారు

  • ఓటు హక్కును కాలరాసేందుకు కేంద్రం కుట్ర: మమత

కోల్‌కతా, మార్చి 21: ప్రధాని మోదీనే అందరికంటే ‘అతిపెద్ద చొరబాటుదారు’ అని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. శనివారం రంజాన్‌ సందర్భంగా కోల్‌కతాలో నిర్వహించిన వేడుకల్లో ఆమె కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌) పేరుతో బీజేపీ ప్రభుత్వం ప్రజల ఓటు హక్కును కాలరాసేందుకు కుట్రలు చేస్తోందని ఆరోపించారు. విదేశాలకు వెళ్లినప్పుడు స్నేహం గురించి మాట్లాడే ప్రధాని, దేశంలోకి అడుగుపెట్టగానే హిందూ-ముస్లిం అని విభజన రాజకీయాలు మొదలు పెడుతున్నారని మండిపడ్డారు. మైనారిటీలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. బెంగాల్‌లో కేంద్రం అప్రకటిత రాష్ట్రపతి పాలనను అమలు చేస్తోందని ఆరోపిస్తూ, తమ ప్రభుత్వాన్ని బంధించినా భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బెంగాల్‌ను విభజించాలని చూసేవారు నరకానికి పోతారన్నారు. మమతా బెనర్జీ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఆమెకు మతి భ్రమించిందని ఆ పార్టీ నేత సువేందు అధికారి అన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతన్నలను ఆదుకుంటాం: సీఎం చంద్రబాబు

దేవుడి సాక్షిగా నేను రాసినవన్నీ నిజాలే.. వైఎస్ విజయలక్ష్మి షాకింగ్ కామెంట్స్

‘ఆస్కార్’ రేంజ్‌లో అవినాశ్‌ ప్రెస్‌మీట్.. బీటెక్ రవి సెటైర్లు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Mar 22 , 2026 | 07:02 AM