టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై అరెస్ట్ వారెంట్..
ABN , Publish Date - Aug 19 , 2026 | 07:21 PM
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాకు పశ్చిమ బెంగాల్‌లోని జిల్లా కోర్టు షాకిచ్చింది. ఆమెపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. విద్వేష ప్రసంగం కేసులో పలుమార్లు సమన్లు జారీ చేసినప్పటికీ కోర్టుకు హాజరుకాకపోవడంతో ఈ చర్య తీసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాకు పశ్చిమ బెంగాల్‌లోని జిల్లా కోర్టు షాకిచ్చింది. ఆమెపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. విద్వేష ప్రసంగం కేసులో పలుమార్లు సమన్లు జారీ చేసినప్పటికీ కోర్టుకు హాజరుకాకపోవడంతో ఈ చర్య తీసుకుంది. ఆగస్టు 28న వారెంట్ అమలుపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది. కృష్ణానగర్ కోర్టులోని మూడో జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఈ ఆదేశాలు జారీ చేశారు (Mahua Moitra Arrest Warrant).
విద్వేష ప్రసంగం కేసులో కోర్టుకు హాజరు కావాల్సిందిగా గతంలో పలుమార్లు సమన్లు పంపినా మహువా మొయిత్రా హాజరు కాలేదని కోర్టు పేర్కొంది. దీంతో అరెస్ట్ వారెంట్ జారీ చేయడం తప్ప మరో మార్గం లేదని న్యాయస్థానం అభిప్రాయపడింది. కోర్టు ఆదేశాల ప్రకారం.. ఆగస్టు 12న కోర్టు ముందు మహువా మొయిత్రా హాజరు కావాల్సి ఉంది. ఆరోజున ఆమె కోర్టుకు రాలేదు. దీంతో ఆగస్టు 19న అయినా హాజరు కావాలని మరో అవకాశం ఇచ్చినప్పటికీ ఆమె రాలేదు. దీంతో కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది (TMC MP Hate Speech Case).
మహిళలను అవమానించేలా వ్యాఖ్యలు చేయడంతో పాటు మతపరమైన భావాలను రెచ్చగొట్టేలా మహువా మొయిత్రా ప్రసంగించారనే ఆరోపణలతో కేసు నమోదైంది (West Bengal News). ఈ కేసులోనే ఆమెకు కోర్టు సమన్లు జారీ చేసింది. మహువా తరఫు న్యాయవాది ఆమెను వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుపరచడం నుంచి మినహాయించాలని కోరారు. అందుకు న్యాయస్థానం అంగీకరించలేదు.
ఇవి కూడా చదవండి..
నీట్ పేపర్ లీక్‌పై సుప్రీంకోర్టులో విచారణ.. ఎన్‌టీఏ సంస్కరణలపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశం..
పుణెలో దారుణం.. 9 ఏళ్ల బాలికపై హత్యాచారం.. పొరుగింటి యువకుడి అరెస్ట్..