విషాదం.. కొండపై నుంచి పడి ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి
ABN , Publish Date - Aug 21 , 2026 | 05:26 PM
ఒక చిన్న మాట.. ఓ కుటుంబాన్ని తీరని విషాదంలోకి నెట్టింది. తండ్రి మందలించాడని కొడుకు కొండపై నుంచి దూకగా.. అతడిని కాపాడేందుకు వెళ్లిన తండ్రి కూడా లోయలో పడిపోయాడు. భర్త, కొడుకు ఇద్దరినీ కోల్పోయిన తల్లి.. మనస్తాపంతో తానూ దూకేయడంతో ఒకే కుటుంబంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్ర శంభాజీనగర్‌లోని కావడియా కొండ సమీపంలో విషాద ఘటన చోటుచేసుకుంది. తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురైన కుమారుడు కొండపై నుంచి దూకినట్లు సమాచారం. తనయుడు లోయలో పడిపోవడంతో అతడిని కాపాడేందుకు తండ్రి కూడా కొండపై నుంచి కిందకు వెళ్లేందుకు ప్రయత్నించి ప్రమాదవశాత్తూ లోయలో పడిపోయాడు. ఈ ఘటనతో అక్కడ తీవ్ర కలకలం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన తండ్రీకొడుకులు లోయలో పడిపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
భర్త, కుమారుడు ఇద్దరూ లోయలో పడిపోయిన విషయం తెలుసుకున్న తల్లి తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమె కూడా కొండపై నుంచి దూకినట్లు సమాచారం. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కావడియా కొండ వద్ద జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు, కుటుంబ సభ్యుల వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మమ్మల్ని అలా పిలవద్దు.. నెటిజన్లను కదిలిస్తున్న చిన్నారి ఆవేదన
మృత్యువు అంచుల దాకా వెళ్లి తప్పించుకున్నాడు.. వీడియో వైరల్