మహారాష్ట్రలో ఓలా, ఉబర్, రాపిడో పూర్తిగా బంద్.. వైరల్ ప్రచారంపై ప్రభుత్వం క్లారిటీ..
ABN , Publish Date - May 16 , 2026 | 08:25 PM
మహారాష్ట్రలో ఓలా, ఉబర్, రాపిడో సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఈ వార్తలు తప్పుదారి పట్టించేలా ఉన్నాయని మహారాష్ట్ర డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ (DGIPR) వెల్లడించింది.
మహారాష్ట్రలో ఓలా, ఉబర్, రాపిడో సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఈ వార్తలు తప్పుదారి పట్టించేలా ఉన్నాయని మహారాష్ట్ర డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ (DGIPR) వెల్లడించింది. 'మహారాష్ట్రలో ఓలా, ఉబర్, రాపిడో సేవలను పూర్తిగా నిలిపివేశారని సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వాదన తప్పుదోవ పట్టించేదిగా ఉంది' అని పేర్కొంది (Ola Uber Rapido Maharashtra).
రాష్ట్రంలో నిషేధం విధించింది కేవలం అనధికారిక బైక్ ట్యాక్సీ సేవలపైనే అని పేర్కొంది. సాధారణ క్యాబ్ సేవలు అయిన ఓలా, ఉబర్, అన్ని అనుమతులతో నడిచే రవాణా సేవలు యధావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. కాగా, అక్రమంగా బైక్ ట్యాక్సీ సేవలను నిర్వహిస్తున్నట్టు ఆరోపణలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. బైక్ ట్యాక్సీ అగ్రిగేటర్లపై చర్యలు తీసుకోవాలంటూ మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ సైబర్ విభాగానికి లేఖ రాశారు (Maharashtra bike taxi ban).
రవాణా శాఖ, మోటార్ వాహనాల నిబంధనలు పాటించకుండా బైక్ ట్యాక్సీ సేవలను అందిస్తున్న అగ్రిగేటర్లపై నిషేధం విధించాలని ఆదేశించారు (Uber Ola shutdown fact check). కొన్ని యాప్స్ చట్టవిరుద్ధంగా బైక్ సర్వీసులు అందిస్తున్నాయని, వాటిని వెంటనే ప్లే స్టోర్, యాప్ స్టోర్ నుంచి తొలగించాలని గూగుల్, యాపిల్ సంస్థలకు మహారాష్ట్ర సైబర్ విభాగం ఫిర్యాదు చేసింది. కాగా, ప్రస్తుతం మహారాష్ట్రలో ఓలా, ఉబర్ క్యాబ్ సేవలు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతున్నాయి. కేవలం అనధికారిక బైక్ ట్యాక్సీ కార్యకలాపాలపైనే చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి..
తైవాన్ కోసం చైనాతో యుద్ధం చేయలేం: ట్రంప్
పాక్ తీరు మారకుంటే.. చరిత్రలో కలిసిపోతుంది: భారత ఆర్మీ చీఫ్