బస్సును ఢీకొన్న రైలు.. 8 మంది మృతి.. వీడియో వైరల్..
ABN , Publish Date - May 16 , 2026 | 08:00 PM
థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో శనివారం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఒక కార్గో ట్రైన్ రైల్వే క్రాసింగ్ వద్ద ఆగి ఉన్న పబ్లిక్ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుమారు 8 మంది మరణించగా, 20 మందికిపైగా గాయపడ్డారు.
థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో శనివారం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఒక కార్గో ట్రైన్ రైల్వే క్రాసింగ్ వద్ద ఆగి ఉన్న పబ్లిక్ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుమారు 8 మంది మరణించగా, 20 మందికిపైగా గాయపడ్డారు. ఈ భయానక ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Bangkok train accident).
బ్యాంకాక్‌లోని మక్కసాన్ రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే క్రాసింగ్ వద్ద వాహనాలు నిలిచిపోయి ఉన్నాయి. ఆ సమయంలో ఒక రైలు వేగంగా వచ్చి పట్టాలపై నిలిచి ఉన్న బస్సును ఢీకొట్టింది. కొద్ది దూరం ఈడ్చుకెళ్లింది. రైలు ఢీకొట్టిన వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. మృతులందరూ బస్సులో ప్రయాణిస్తున్నవారే. సమీపంలోని కొందరు బైక్ రైడర్లు గాయాలపాలయ్యారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం (Thailand bus train collision).
అగ్నిమాపక సిబ్బంది గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు (Bangkok cargo train crash). కాగా, ఈ ప్రమాదానికి కారణమేంటనే అంశంపై పోలీసులు విచారణ ప్రారంభించారు. రైల్వే గేట్లు సరిగా పనిచేయలేదా? లేదా ట్రాఫిక్ కారణంగా వాహనాలు రైల్వే ట్రాక్‌పై చిక్కుకుపోయాయా? అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. థాయ్ ఉప రవాణా మంత్రి సిరిపాంగ్ ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు.
ఇవి కూడా చదవండి..
తైవాన్ కోసం చైనాతో యుద్ధం చేయలేం: ట్రంప్
పాక్ తీరు మారకుంటే.. చరిత్రలో కలిసిపోతుంది: భారత ఆర్మీ చీఫ్