Share News

అక్టోబర్ 7 దాడుల సూత్రధారి హతం.. ఇజ్రాయెల్ ప్రకటన..

ABN , Publish Date - May 16 , 2026 | 07:37 PM

హమాస్ సాయుధ విభాగానికి నాయకత్వం వహిస్తున్న ఇజ్ అల్-దిన్ అల్-హద్దాద్‌ను హతమార్చినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. గాజాలో జరిగిన వైమానిక దాడిలో హద్దాద్‌ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది.

అక్టోబర్ 7 దాడుల సూత్రధారి హతం.. ఇజ్రాయెల్ ప్రకటన..
Hamas military chief killed

హమాస్ సాయుధ విభాగానికి నాయకత్వం వహిస్తున్న ఇజ్ అల్-దిన్ అల్-హద్దాద్‌ను హతమార్చినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. గాజాలో జరిగిన వైమానిక దాడిలో హద్దాద్‌ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్‌పై జరిగిన భారీ దాడుల రూపకర్తల్లో హద్దాద్ ఒకరని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) పేర్కొంది (Hamas military chief killed).


గాజా సిటీలోని రిమాల్ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడి నిర్వహించింది. ఈ దాడిలో హద్దాద్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా మరణించారు. హమాస్ కూడా హద్దాద్‌ మరణాన్ని ధ్రువీకరించింది. గతంలో పలుమార్లు ఇజ్రాయెల్ హత్యాయత్నాల నుంచి హద్దాద్ తప్పించుకున్నారు. 2025లో మహ్మద్ సిన్వార్ మరణం తర్వాత హమాస్ సైనిక విభాగానికి ప్రధాన అధిపతిగా బాధ్యతలు చేపట్టారు. హద్దాద్‌ను 'ది ఘోస్ట్' అనే కోడ్ పేరుతో పిలుస్తారు (Israel Hamas war).


అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన భారీ దాడుల్లో సుమారు 1,200 మంది పౌరులు మరణించారు (Israel Gaza conflict 2026). 250 మందిని బందీలుగా పట్టుకున్నారు. ఆ దాడుల తర్వాత గాజాలో యుద్ధం ప్రారంభమైంది. అక్టోబర్ 7 దాడులకు బాధ్యులైన ప్రతి హమాస్ నేతను లక్ష్యంగా చేసుకుంటామని ఇజ్రాయెల్ ఇప్పటికే ప్రకటించింది. తాజాగా హద్దాద్ హత్యను ఇజ్రాయెల్ 'పెద్ద సైనిక విజయం'గా అభివర్ణించింది.


ఇవి కూడా చదవండి..

తైవాన్ కోసం చైనాతో యుద్ధం చేయలేం: ట్రంప్


పాక్ తీరు మారకుంటే.. చరిత్రలో కలిసిపోతుంది: భారత ఆర్మీ చీఫ్

Updated Date - May 16 , 2026 | 07:48 PM